ఉద్యోగుల విభజనపై ఖరారైన మార్గదర్శకాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల శాశ్వత విభజనపై కమలనాథన్ కమిటీ భేటీ సోమవారం సాయంత్రం ముగిసింది. ఉద్యోగుల విభజన అంశంలో ప్రతి ఉద్యోగికీ ఆప్షన్ ఉంటుందని కమలనాథన్ కమిటి స్పష్టం చేసింది.
ఉద్యోగుల శాశ్వత విభజనపై మార్గదర్శకాలు ఖరారయ్యాయని కమిటీ భేటిలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో పెడుతామని మీడియాకు వెల్లడించారు.
కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాల స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం నుంచి 10 రోజుల గడువు ఇవ్వనున్నట్టు కమలనాథన్ కమిటీ తెలిపింది. రెండుమూడ్రోజుల్లో వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలను ఉంచుతామని కమలనాథన్ వెల్లడించారు. ఉద్యోగుల విభజన అంశంపై అధ్యయనం చేయడానికి కమలనాథన్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.