తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.