'పోలవరం' బిల్లుకు ప్రణబ్ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కింద ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాల్లో 200 ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడానికి పార్లమెంట్ లో చట్టంగా చేస్తూ సవరణ చేసిన బిల్లుకు ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆమోదం తెలిపినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గతవారం పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, దక్షిణ గోదావరి జిల్లాలోని 50 వేల మంది కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. అలాగే ఒడిశా, చత్తీస్ ఘడ్ లో కూడా 2 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది.