assent
-
Uttarakhand Ucc: ‘యూసీసీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటిని ఒకే గొడుగుకు కిందకు తీసుకువచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. యూసీసీ బిల్లు ముస్లింల సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. సీఎం స్టాలిన్‌కు ఆ అధికారం లేదు -
5 చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం
-
'పోలవరం' బిల్లుకు ప్రణబ్ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కింద ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాల్లో 200 ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడానికి పార్లమెంట్ లో చట్టంగా చేస్తూ సవరణ చేసిన బిల్లుకు ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆమోదం తెలిపినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గతవారం పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, దక్షిణ గోదావరి జిల్లాలోని 50 వేల మంది కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. అలాగే ఒడిశా, చత్తీస్ ఘడ్ లో కూడా 2 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది.