న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటిని ఒకే గొడుగుకు కిందకు తీసుకువచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది.
తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. యూసీసీ బిల్లు ముస్లింల సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment