నేను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో?: తాటి | iam which state mla ? thati | Sakshi
Sakshi News home page

నేను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో?: తాటి

Published Sat, Jul 19 2014 1:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

నేను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో?: తాటి - Sakshi

నేను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో?: తాటి

అశ్వారావుపేట: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా పోలవరం ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల తాను ఎక్కడ ఉండాలో.. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో తేల్చిచెప్పాల్సిందిగా సుప్రీం కోర్టును అశ్రయిస్తానని అశ్వారావుపేట ఎమ్మెల్యే,  వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాత్రి అశ్వారావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రాంతమైన తన స్వగ్రామం కన్నాయిగుట్టను ఏపీలో కలిపేయడం వల్ల తాను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అనే విషయం త నకే అంతుపట్టడం లేదన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల వారితోపాటు తననూ ఏపీకి చెందిన వ్యక్తిగా ఆర్డినెన్స్ మార్చివేసిందని.. అక్కడా, ఇక్కడా తన శాసనసభ నియోజకవర్గ ప్రజలున్నారని.. ఈతరుణంలో తాను ఏరాష్ట్ర ఎమ్మెల్యేనో తెలీడం లేదన్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement