tati venkateshwarlu
-
మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మహాలక్ష్మి(27) గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని ముందు గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మహాలక్ష్మిని ఆమె వ్యక్తిగత సహాయకురాలు గమనించి, ఇరుగుపొరుగు సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి దమ్మపేటకు చేరుకుని అక్కడి నివాసంలో ఉండిపోయారు. వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి.. కరీంనగర్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మహాలక్ష్మి పీజీ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నారు. 15 రోజులుగా మహాలక్ష్మి ముభావంగా ఉంటోందని, పీజీ ప్రవేశపరీక్ష సమీపిస్తున్నందున ఆందోళనకు గురవుతోందని భావించానని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. స్థలం మారితే మంచిదని బంధు వుల ఇంటికి పంపించానని, రెండు రోజులకు తిరిగొచ్చి మామూలుగానే ఉంటున్నట్టు చెప్పారు. ఇంతలోనే తన కుమార్తె అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మానసిక ఒత్తిడితోనే మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన వెంకటరెడ్డి
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో గందరగోళం నెలకొంది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులు ఎవరికి వారుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు పూర్తయ్యేలోగా గ్రూపు రాజకీయాలు మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగగా, ఇప్పుడు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తాజాగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కీలకమైన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత కీలకమైన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలను ప్రభావితం చేసే సీనియర్ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటుగా రెండు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అధికార పార్టీకి రాజీనామా చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో కొడకండ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అనుచరుడిగా వ్యవహరించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తగూడెం నియోజకవర్గంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఉన్నాయి. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సైతం కొడకండ్ల కీలకపాత్ర పోషించారు. తరువాత కాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సైతం కీలకంగా వ్యవహరించారు. తాటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో నియోజకవర్గం నుంచి తన అనుచరులతో కొడకండ్ల కూడా వెళ్లారు. అయితే తాటి వెంకటేశ్వర్లు తనకు ప్రాధాన్యత తగ్గించారంటూ గత ఏడాది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రెండు రోజుల ముందు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. దీంతో తాటి వెంకటేశ్వర్లుకు భారీ దెబ్బ తగిలినట్టయింది. వచ్చే ఎన్నికల్లో తాటికి గడ్డు పరిస్థితే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొడకండ్లను కలిసిన జలగం ప్రసాదరావు.. ప్రగతి నివేదన సభకు వెళ్లినప్పటికీ.. తాటి వెంకటేశ్వర్లుకు ఆందోళన కలిగించే అంశం చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు కలిగి ఉన్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చంద్రుగొండకు వచ్చి కొడకండ్ల వెంకటరెడ్డిని కలిశారు. అత్యంత సీనియర్ అయిన వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ప్రసాదరావు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. ప్రస్తుతం దేశానికి కాంగ్రెస్, రాహుల్ అవసరం ఉందని చెప్పిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి జిల్లాలోని ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని కొడకండ్ల ఇంటి నుంచే ప్రకటించారు. దీంతో ఈ ప్రకటన కొత్తగూడెంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. -
మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు పంచాయతీ వర్కర్ల వినతి సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీలలో ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని వైఎస్సార్సీపీ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ సంఘం ఖమ్మం జిల్లా ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే తాటికి హైదరాబాద్‌లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సేవలలో గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ అధినాయకత్వం పేర్కొన్నందున ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. తమ వినతిని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. -
నేను ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో?: తాటి
అశ్వారావుపేట: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా పోలవరం ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల తాను ఎక్కడ ఉండాలో.. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో తేల్చిచెప్పాల్సిందిగా సుప్రీం కోర్టును అశ్రయిస్తానని అశ్వారావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాత్రి అశ్వారావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రాంతమైన తన స్వగ్రామం కన్నాయిగుట్టను ఏపీలో కలిపేయడం వల్ల తాను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అనే విషయం త నకే అంతుపట్టడం లేదన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల వారితోపాటు తననూ ఏపీకి చెందిన వ్యక్తిగా ఆర్డినెన్స్ మార్చివేసిందని.. అక్కడా, ఇక్కడా తన శాసనసభ నియోజకవర్గ ప్రజలున్నారని.. ఈతరుణంలో తాను ఏరాష్ట్ర ఎమ్మెల్యేనో తెలీడం లేదన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
తెలంగాణ సభలో ‘పేట’కు అరుదైన చాన్స్
వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షనేతగా తాటి వెంకటేశ్వర్లు దశాబ్దంన్నర తర్వాత జిల్లాకు దక్కిన గౌరవం ఝ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం దమ్మపేట, న్యూస్‌లైన్: తెలంగాణ తొలి శాసనసభలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అరుదైన అవకాశం దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ‘పేట’ ఎమ్మెల్యేగా ఎన్నికైన తాటి వెంకటేశ్వర్లు సభలో ఆ పార్టీ నాయకునిగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు శాసనసభలో ఆయా పార్టీల పక్షనాయకులుగా జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు( సీపీఎం, మధిర), పువ్వాడ నాగేశ్వరరావు ( సీపీఐ, ఖమ్మం)లు వ్యవహరించారు. తిరిగి అదే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లుకు దశాబ్దంన్నర తర్వాత దక్కింది. తెలంగాణ శాసనసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకునిగా ఎన్నికైన తాటి, శాసనసభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. వివరాలు తాటి మాటల్లోనే... ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం నాది: తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ‘ప్రజలిచ్చిన ఈ అవకాశంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో నిరంతరం పోరాటం చేస్తాను. ప్రజాసమస్యలపై సభలో చర్చించి, వాటిని పరిష్కరించడానికి తోడ్పడుతాను. నా నియోజకవర్గంలోని సమస్యలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తాను. పోలవరం నిర్వాసితుల కోసం పోరాడుతాను. ఆదివాసీ జీవితం అడవితో ముడిపడి ఉంది. అటువంటి వారిని ప్రకృతి నుంచి వేరు చేయడం తగదు. తెలంగాణ నుంచి అడవిబిడ్డలను వేరుచేస్తే సహిం చేది లేదు. దీనిపై అవసరమైతే నిండు సభలో నే ఆందోళన చేస్తామని గతంలోనే ప్రకటిం చాం. దానికి కట్టుబడి ఉంటాం. పోలవరంపై ఇప్పుడు అన్ని పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. దీనికి ఆజ్యం పోసిన కాం గ్రెస్, టీడీపీలు ఇప్పుడు పోలవరం వ్యతిరే క ఉద్యమానికి మద్దతు తెలపటం విడ్డూరంగా ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తాను. ని యోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయిస్తాను. కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు మంజూర య్యేలా చూస్తా. తెలంగాణలో కొత్త గా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోలవరం ముంపు ప్రాంతాల విలీ నంపై కేంద్రంపై మిలిటెంట్ పోరా టంచేసి ఆర్డినెన్స్‌ను రద్దు చేయించాలి.’