తెలంగాణ సభలో ‘పేట’కు అరుదైన చాన్స్
- వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ పక్షనేతగా తాటి వెంకటేశ్వర్లు
- దశాబ్దంన్నర తర్వాత జిల్లాకు దక్కిన గౌరవం ఝ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
దమ్మపేట, న్యూస్‌లైన్: తెలంగాణ తొలి శాసనసభలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అరుదైన అవకాశం దక్కింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ‘పేట’ ఎమ్మెల్యేగా ఎన్నికైన తాటి వెంకటేశ్వర్లు సభలో ఆ పార్టీ నాయకునిగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు శాసనసభలో ఆయా పార్టీల పక్షనాయకులుగా జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు( సీపీఎం, మధిర), పువ్వాడ నాగేశ్వరరావు ( సీపీఐ, ఖమ్మం)లు వ్యవహరించారు. తిరిగి అదే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లుకు దశాబ్దంన్నర తర్వాత దక్కింది. తెలంగాణ శాసనసభలో వైఎస్‌ఆర్‌సీపీ పక్ష నాయకునిగా ఎన్నికైన తాటి, శాసనసభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
వివరాలు తాటి మాటల్లోనే...
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం నాది: తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ‘ప్రజలిచ్చిన ఈ అవకాశంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో నిరంతరం పోరాటం చేస్తాను. ప్రజాసమస్యలపై సభలో చర్చించి, వాటిని పరిష్కరించడానికి తోడ్పడుతాను. నా నియోజకవర్గంలోని సమస్యలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తాను. పోలవరం నిర్వాసితుల కోసం పోరాడుతాను. ఆదివాసీ జీవితం అడవితో ముడిపడి ఉంది.
అటువంటి వారిని ప్రకృతి నుంచి వేరు చేయడం తగదు. తెలంగాణ నుంచి అడవిబిడ్డలను వేరుచేస్తే సహిం చేది లేదు. దీనిపై అవసరమైతే నిండు సభలో నే ఆందోళన చేస్తామని గతంలోనే ప్రకటిం చాం. దానికి కట్టుబడి ఉంటాం. పోలవరంపై ఇప్పుడు అన్ని పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. దీనికి ఆజ్యం పోసిన కాం గ్రెస్, టీడీపీలు ఇప్పుడు పోలవరం వ్యతిరే క ఉద్యమానికి మద్దతు తెలపటం విడ్డూరంగా ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తాను. ని యోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయిస్తాను. కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు మంజూర య్యేలా చూస్తా. తెలంగాణలో కొత్త గా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలవరం ముంపు ప్రాంతాల విలీ నంపై కేంద్రంపై మిలిటెంట్ పోరా టంచేసి ఆర్డినెన్స్‌ను రద్దు చేయించాలి.’