మేం వెళ్లిపోతున్నాం | Telangana teachers to go from Andhra pradesh releave letter | Sakshi
Sakshi News home page

మేం వెళ్లిపోతున్నాం

Published Wed, Jun 24 2015 2:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

మేం వెళ్లిపోతున్నాం - Sakshi

మేం వెళ్లిపోతున్నాం

రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయిన తెలంగాణ టీచర్లు
 చింతూరు: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు సర్దుబాటు అయి, తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పని చేస్తున్న టీచర్లు మంగళవారం స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలిచ్చారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు తమను రిలీవ్ చేయాలని వారు కొంతకాలం నుంచి ఆంధ్రా అధికారులను కోరుతున్నారు. తమ ఉద్యోగులను తమ రాష్ట్రానికి పంపాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం విలీన మండలాల అధికారులకు లేఖలు రాశారు. తమకు రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు రావాలని ఇక్కడి అధికారులు చెప్పడంతో తెలంగాణ ఉపాధ్యాయులు నిరాహార దీక్షలకు దిగారు. తమను ఆంధ్రా అధికారులు రిలీవ్ చేయడం లేదని, దీనిపై తెలంగాణ అధికారులే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విలీన మండలాల్లోని తెలంగాణ ఉపాధ్యాయులంతా సోమవారం ఖమ్మం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు.
 
 అనంతరం వారంతా మంగళవారం తమ ఎంఈఓ కార్యాలయాలకు చేరుకుని మూకుమ్మడిగా స్వచ్ఛంద రిలీవ్ లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. ఇప్పటికే చింతూరు మండలంలో ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లిపోగా.. తాజాగా జిల్లా పరిషత్‌కు చెందిన 11 మంది, ఎంపీపీ, ఎంపీయూపీ పాఠశాలలకు చెందిన 43 మంది స్వచ్ఛంద రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయారు. నెల్లిపాక మండలంలో 138 మంది, వీఆర్ పురం మండలంలో 48 మంది, కూనవరం మండలంలో 33 మంది కలిపి మొత్తంగా 273 మంది ఈవిధంగా లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణ ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో చింతూరు మండలంలోని 24 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement