
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఐఏఎఫ్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ఉత్కంఠత కొనసాగింది. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment