Plane Landing
-
రహదారే.. రన్‌వే.. జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం.. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్‌పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్‌వే స్ట్రిప్‌పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్‌వేపై వెళ్లాయి. ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్‌ను తాకుతూ(డెడ్‌లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్‌పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్‌పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్‌పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు.. యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్‌రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఐఏఎఫ్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ఉత్కంఠత కొనసాగింది. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
-
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
మోన్‌ట్రియల్(కెనడా): ఎయిర్ కెనడా విమానంలో ఆస్ట్రేలియాకు వెళుతున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపంతో విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు గాల్లోకి ఎగిరి పైకప్పును ఢీకొట్టారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. వివరాలు.. కెనడా నుంచి 269 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో గురువారం సిడ్నీ వెళ్తున్న బోయింగ్ విమానంలో హవాయి రాష్ట్రం దాటిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు పై కప్పును గుద్దుకున్నారు. పైకెగిరి కింద పడటంతో 35 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. విమానం సీలింగ్ అక్కడక్కడా దెబ్బతిని వైర్లు బయటకు వచ్చాయి. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి హోనోలులు విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. తదుపరి విమానం వచ్చేంతవరకు ప్రయాణికులందరికి ఎయిర్ కెనడా వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. -
గాలిలో అతలాకుతలమైన విమానాలు..
డసెల్డార్ఫ్(జర్మనీ) : యూరప్‌ను వణికించిన శక్తిమంతమైన తుపాను ఫ్రెడరిక్ ఎట్టకేలకు శాంతించింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలమైన జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీడయంతో దెబ్బతిన్న రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తుపాను ధాటికి తొమ్మిది మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం జరిగింది. వైరల్ వీడియో : ఫ్రెడరిక్ తుపాను సృష్టించిన బీభత్సం తాలుకు వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జర్మనీలోని ప్రఖ్యాత డసెల్డార్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాస్‌విండ్ ల్యాండింగ్ వీడియో ఒకటి వైరల్ అయింది. రన్‌వేపై ల్యాండ్ కావాల్సిన విమానాలు.. గాలిలోనే అతలాకుతలమైన దృశ్యాలను ఓ వీడియో గ్రాఫర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చాకచక్యంగా విమానాలను ల్యాండ్ చేసిన పైలట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వణికిన విమానాలు వీడియో -
గాలిలో అతలాకుతలమైన విమానాలు
-
పొగమంచుతో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం
విమానాశ్రయం (గన్నవరం): పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం పలు విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాలు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం, వైజాగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాలకు కూడా ల్యాండింగ్ సమస్య ఎదురవడంతో అరగంటకుపైగా గాలిలోనే చక్కర్లు కొట్టాయి. తర్వాత మంచు తీవ్రత తగ్గడంతో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్‌జెట్ విమానం సుమారు గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు చేరుకుంది. గత మూడ్రోజులుగా పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
రియాక్ట్ అవ్వడానికి సెకన్ లేటైనా..
వేగంగా వస్తున్న విమానం ఫోటోను తీయడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీనికి సంబంధించిన 360 డిగ్రీల్లో తీసిన వీడియోను చూసిన వారంతా, వామ్మో రియాక్ట్ అవ్వడంలో సెకన్లలో తేడా వచ్చినా తల ఎగిరిపోయేదేమో అంటున్నారు. ఈ సంఘటన ఉత్తర అమెరికా ఖండంలో సెయింట్ బార్ట్స్ దీవిలోని గస్టఫ్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటు చేసుకుంది. మెక్కీ జైదీ అనే పర్యాటకుడు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడానికి కిందకు దిగుతున్న విమానాన్ని దగ్గర నుంచి ఫోట్ తీయడానికి ప్రయత్నించి తృటిలో తప్పించుకున్నాడు. 'విమాన వేగాన్ని జడ్జ్ చేసి తప్పించుకోవడం కష్టమే, ఆ సమయంలో నేను కెమెరాలో విమానాన్ని బందించాలనుకున్నాను. విమానం సమీపిస్తుండగా సహజంగానే కిందికి వంగి తప్పించుకున్నాను' అని మెక్కీ జైదీ పేర్కొన్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు ఆ ప్రదేశంలో వార్నింగ్ బోర్డులు కూడా పెట్టారు. అయితే తాను పబ్లిక్ రోడ్డుపై మాత్రమే ఉన్నానని, నిషిద్ధ ప్రాంతంలో కాదని వివరణ ఇచ్చుకున్నాడు. మిక్కీ జైదీ విమానం సమీపిస్తుండగా 360డిగ్రీలో మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోలో విమానం ఆ వ్యక్తిని ఢీకొట్టినట్టుగా చాలా సమీపంలోంచి వెళ్లింది. -
ఏమైంది?
♦ గాలిలో అరగంట చక్కర్లు కొట్టిన విమానం ♦ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల బంధువుల్లో ఆందోళన ♦ 45 నిమిషాలు ఆలస్యంగా బెంగళూరుకు పయనం సాక్షి ప్రతినిధి, కడప : కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్న విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. కారు మబ్బులు, చిరు జల్లుల మధ్య పెద్ద శబ్ధంతో విమానం అలా గాలిలో రౌండ్లు కొడుతుంటే నగర వాసులు ఉత్కంఠకు గురయ్యారు. ఎట్టకేలకు ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది. ఎయిర్ పెగాసెస్‌కు చెందిన విమానం బెంగుళూరులో ఉదయం 10.45 గంటలకు కడపకు బయలుదేరింది. 11.30 గంటలకు కడపలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో అరగంటపాటు గాలిలోనే పెలైట్ చక్కర్లు కొట్టించారు. ఏమైందో అర్థం కాక అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బంధువులు సైతం హైరానా పడ్డారు. వాతావరణం అనుకూలించనప్పుడు ఇది మామూలేనని, ఆందోళన అక్కరలేదని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శ్రీనివాసన్ ప్రయాణికుల బంధువులను సముదాయించారు. అరగంట తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంద రూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి 12.25 గంటలకు టేకాఫ్ తీసుకొని అదే విమానం ప్రయాణికులతో బెంగుళూరుకు వెళ్లిపోయిం ది. విమానాశ్రయాల సమీపంలో ఈ తరహా ఘటన లు మామూలే. కడపలో ఇటీవలే విమానాశ్రయం ప్రారంభమైంది. దీంతో ఏమైందోనని పలువురు ఉత్కంఠకు లోనయ్యారు. -
ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు
పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. విమాన ప్రయాణీకులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పెషావర్ విమానాశ్రయంలో పీకే 756 విమానం కిందకు దిగుతుండగా.... టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా, ముగ్గురు విమాన సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైలెట్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. మొత్తం ఫ్లైట్‌కు ఆరు బుల్లెట్లు తగిలాయని.. ఒక బుల్లెట్ విమాన ఇంజిన్‌లో ఇరుక్కుపోయిందని ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. దాదాపు 178 మంది ప్రయాణికులతో విమానం సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్‌కు వస్తుందని అధికారులు చెప్పారు. ఊహించని దాడితో బచాఖన్ విమానాశ్రయం వద్ద అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడి నేపథ్యంలో విమాన రాకపోకలు, కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. జూన్ 8న తాలిబన్లు కరాచీ ఎయిర్‌పోర్టుపై విరుచుకుపడి 34 మంది ప్రయాణికుల ప్రాణాలను తీశారు. ఇంతలోనే మరోసారి ఉగ్రమూక కాల్పులకు తెగబడడంతో పాకిస్తాన్ ప్రజలు వణికిపోతున్నారు.