♦ ఒకే ట్రిప్పులో 78 గుర్రాలను మోసుకెళుతుంది..
♦ ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణ
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఇండియన్ ఏవియేషన్ షోలో ఎతిహాద్ కార్గో స్పెషల్ అట్రాక్షన్. గంటకు పదివేల లీటర్ల ఇంధనం బర్న్ అయ్యే ఈ బోయింగ్ 777 ఫ్రైటర్‌కు ఏకంగా 78 గుర్రాలను అలవోకగా ఓ దేశం నుంచి మరో దేశానికి తరలించగలిగే సామర్థ్యముంది. ఈ ఫ్లైట్‌లో 550 క్యూబిక్ మీటర్ల స్పేస్ వుంది. గుర్రాలను తీసుకెళ్లేటప్పుడు వాటి కాళ్లను అటుఇటు కదలకుండా ఉండేందుకు లాక్ సిస్టమ్ కూడా ఉంది. గుర్రాలతో పాటు ఈ కార్గో ఫ్లైట్ ఫార్మాప్రొడక్ట్స్‌ను ఎక్కువగా రవాణా చేస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులకు వారంలో 14 సర్వీసులను నిర్వహిస్తున్న ఈ విమానం ఏటా 1,20,000 టన్నుల సామగ్రిని భారత్ నుంచి తరలి స్తోంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్రైట్ మార్కెట్‌లో దీనికి 9% వాటా ఉంది.