బేగంపేటలో విమానం మోత మోగింది | Air India flight makes landing at begumpet airport several times | Sakshi
Sakshi News home page

బేగంపేటలో విమానం మోత మోగింది

Published Sat, Sep 27 2014 8:03 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

బేగంపేటలో విమానం మోత మోగింది - Sakshi

బేగంపేటలో విమానం మోత మోగింది

హైదరాబాద్ :  బేగంపేట విమానాశ్రయంలో శనివారం ఒక్కసారిగా విమానం మోత మోగింది. ఓ విమానం పదుల సార్లు ల్యాండింగ్‌కు రావడం.. తిరిగి పైకి ఎగిరిపోవటం .... ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఓ  విమానం సికింద్రాబాద్ చుట్టూ 20సార్లు చక్కర్లు కొట్టింది.

 

ఎయిర్‌పోర్టుకు రావడం ల్యాండింగ్‌ అవుతున్నట్లు కిందికి దిగడం.. మళ్లీ తిరిగి పైకి ఎగరడంతో చుట్టుపక్కలవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తాయేమోనని  హడలిపోయారు. తీరా ఎయిర్‌ పోర్టు అధారిటీని సంప్రదించగా... అసలు విషయం తెలిసింది. ఎయిర్‌ ఇండియా పైలెట్లు  శిక్షణ నిమిత్తం ల్యాండింగ్ చేస్తున్నట్లు  చెప్పడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement