ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి | Air India plane makes emergency landing at Bhopal | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి

Published Wed, Mar 9 2016 8:18 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి - Sakshi

ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి

భోపాల్ః మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం ఉదయం విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి ఢీకొట్టడంతో బయల్దేరిన కొద్ది సమయానికే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియాకు చెందిన ఎఎల్ 634 విమానం... 129 మంది ప్రయాణీకులతో ఉదయం 8.30 నిమిషాలకు భోపాల్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాస్సేపటికే పక్షి ఢీకొట్టి  ఇంజన్ లో ఇరుక్కుపోయింది. దీంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వారి సలహా మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement