దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భత్కల్తోపాటు ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు.
కాగా భత్కల్ను రేపు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరపరచనున్నారు. యాసిన్ భత్కల్ను హైదరాబాద్లో విచారించేందుకు న్యూఢిల్లీలోని కోర్టు శనివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. యాసిన్ భత్క్లల్తోపాటు మరోకు ఇటీవల భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. గతంలో భారత్లో పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.