సీఎం చంద్రబాబు రేపు రాక | CM Chandrababu arrival tomorrow | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు రేపు రాక

Published Thu, Mar 12 2015 2:45 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

CM Chandrababu arrival tomorrow

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13వ తేదీన తలపెట్టిన విశాఖ నగర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో నేరుగా బీచ్‌రోడ్‌లోని నోవొట ల్‌కు చేరుకుంటారు.

నోవాటెల్ వి.కన్వెన్షన్‌లో జరుగనున్న కార్యక్రమంలో  మౌలిక సదుపాయల మిషన్‌ను బాబు ప్రారంభించనున్నారు. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో తొలుత డిపార్టుమెంట్ సెక్రటరీ ఈ మిషన్ ప్రాధాన్యతను వివరిస్తారు. అనంతరం పోర్టు ఆధారిత అభివృద్ధి, మేకింగ్ ఆఫ్ ఏపీ, లాజిస్టిక్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, అసోసియేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్‌పై చర్చిస్తారు. వివిధ సంస్థల సీఈవోలు ప్రసంగిస్తారు. అనంతరం మిషన్ కోసం..మేకింగ్ ఆఫ్ ఏపీ ప్రొగ్రామ్ కోసం ముఖ్యమంత్రిచ చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. చివరగా సీఈవోలతో చంద్రబాబు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం  సాయంత్రం ఏడుగంటలకు బయల్దేరి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement