సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీ బిజీగా ఉన్నారు. నగరానికి చేరుకున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రైతులతో అమిత్ షా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా.. తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోందని రైతులను ఆరా తీశారు. ఈ క్రమంలో విద్యుత్ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్ షాను కోరగా.. దానికి అమిత్ షా సమాధానమిస్తూ మార్చాల్సింది చట్టం కాదు. ఇక్కడి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంలేదు. దీని వల్ల తెలంగాణ రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు.
దేశవ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం భూసార పరీక్షలు జరగడంలేదు. ఇన్‌పుట్ సబ్సీడీ కూడా రావడంలేదని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అలాగే, సేంద్రీయ వ్యవసాయం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంలోనే మోటర్లకు మీటర్లు అనే ప్రతిపాదన లేదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారని అన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని చెప్పారని రైతులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్!
Comments
Please login to add a commentAdd a comment