
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మజ్లీస్ నేతల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో రాజాసింగ్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్‌కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే..
Comments
Please login to add a commentAdd a comment