హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. అయితే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం తీవ్ర ప్రభావితం చేస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడే యాత్ర చేస్తూ ఉండటం కాంగ్రెస్‌కు కలసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనాలు పెంచుకుంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక జరిగే నవంబర్ 3వ తేదీన రాహుల్ గాంధీ హైదరాబాద్ సరిహద్దులోని ముంతంగి నుంచి సంగారెడ్డి మధ్య ఉంటారని భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడుపై రాహుల్ గాంధీతో ఏదైనా ప్రకటన చేయిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై తమ రాజకీయ లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment