
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్, బండి సంజయ్ పాదయాత్ర, రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, మునుగోడు ఉప ఎన్నిక.. ఇలా రాజకీయాలు వీటి చుట్టే తిరుగుతున్నాయి. వీటిలో పొలిటికల్ లీడర్స్ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మునుగోడుపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. కాగా, తెలంగాణ కాంగ్రస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. గాంధీభవన్‌కు మునుగోడు టికెట్ ఆశావహులను సమావేశానికి పిలిచారు. ఇక, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత ఉన్నారు. కాగా, ఆశావహుల బలాబలాపై సునీల్ కనుగోలు ఇప్పటికే పీసీసీకి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో మునుగోడులో అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయనుంది.
మరోవైపు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, తాను కొన్ని సలహాలు ఇచ్చానని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: గులాబీ బాస్ మదిలో ఏముంది.. ఆ సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా?
Comments
Please login to add a commentAdd a comment