![KA Paul Birthday Celebration In Munugode - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/26/ka-paul.jpg.webp?itok=F_HCbdDp)
మాట్లాడుతున్న కేఏ పాల్, గద్దర్
సాక్షి, నల్గొండ: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇస్తే తాను లక్ష కోట్ల రూపాయలు ఇస్తానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.ఏ పాల్ అన్నారు. ఆదివారం కేఏపీల్ తన 59వ జన్మదిన వేడుకలను మునుగోడులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసినా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా నేటికీ సామాజిక న్యాయం ఎక్కడా కన్పించడం లేదన్నారు. మునుగోడులో బడుగు, బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకే ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నానన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఓటు అనేది ఓ వజ్రాయుధం, దానిని అమ్ముకుంటే ఎప్పటికీ బానిసలుగా బతకాల్సిందే అని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు తన ఓటు హక్కుని సమర్థుడైన నాయకుడికి వేయాలి తప్పా, డబ్బు, మద్యం ఇచ్చేవాడికి వేయవద్దన్నారు. ఈ సందర్భంగా పాడిన పాటలు, చేసిన నృత్యాలు సమావేశానికి వచ్చిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment