
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రగతి భవన్‌లో జరిగిన టీర్‌ఎస్‌ఎస్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్.. ఎన్నికల విషయంలో సర్వేలు అన్ని టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 96 సీట్లు పక్కా వస్తాయి. ఎమ్మెల్యేలంతా ధైర్యంగా పనిచేసుకోండి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపు. 200 శాతం టీఆర్‌ఎస్‌దే గెలుపు. ఎమ్మెల్యేలను ఇంచార్జ్‌లుగా పంపిస్తా. మునుగోడులో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జ్‌గా ఉంటారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీలు గెలిచే అవకాశమే లేదు. మునుగోడులో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఇక్కడ కుదరదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడేది లేదు. వాళ్లు అవకాశమిచ్చే ఏ పనులు చేయవద్దు. శివసేన, ఆర్జేడీ, ఆప్‌ను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment