Bikshamaiah Goud Joins TRS Party, Minister KTR Welcomed Him - Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన భిక్షమయ్య గౌడ్.. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్‌

Published Thu, Oct 20 2022 8:27 PM | Last Updated on Thu, Oct 20 2022 9:21 PM

Bikshamaiah Goud Joins TRS Minister KTR Welcomed Him - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డితో పాటు ఇతర టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు భిక్షమయ్య గౌడ్. నల్లగొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా సమాధి చేయాలన్నారు.

అయితే కొద్ది రోజుల క్రితమే బీజేపీలోకి వెళ్లిన భిక్షమయ్య గౌడ్.. ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు. కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement