సాక్షి, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి స్వచ్ఛంద పదవీ విరమణ లేఖను అందజేశారు. మరో 10 నెలల సర్వీస్ ఉండగానే మురళీ విధులను నుంచి తప్పుకుంటున్నారు.
మురళీ ప్రస్తుతం పురావస్తు శాఖ సంచాలకులుగా ఉన్నారు. భూపాలపల్లి కలెక్టర్‌గా ఉన్న మురళిని తెలంగాణ ప్రభుత్వం ఆప్రాధాన్యత గల పురావాస్తు శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. దీంతో మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
తన 38 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ లేనంత ఖాళీగా ఉన్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని మురళి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా తాను పేదల కోసం కష్టపడ్డానని చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేశానన్నారు. ఏడాది కాలంగా సరైన పనిలేనందున తనకు అసంతృప్తిగా ఉందన్నారు. చాలామంది ఎస్సీ, బీసీ, ఎస్టీ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. తనలాగే చాలా మంది అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. అందువల్ల బయటకు వచ్చి ఏదోఒకటి చేద్దామనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment