న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) కింద ఇప్పటికి 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉం టుంది. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000– 80,000 మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకుంటారని, దీనివల్ల రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment