భార్య చికెన్‌ వండలేదని యువకుడి ఆత్మహత్య | Andhra Pradesh: Man Dies by Suicide After Dispute With Wife Over Chicken Curry] | Sakshi
Sakshi News home page

భార్య చికెన్‌ వండలేదని యువకుడి ఆత్మహత్య

Sep 23 2025 8:48 AM | Updated on Sep 23 2025 12:53 PM

wife and husband incident

యర్రగొండపాలెం: భార్య చికెన్‌ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. 

ఆదివారం కావడంతో చికెన్‌ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్‌ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement