విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బొండా ఉమా జాగీర్ కాదని బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ మహోత్సవానికి గౌరవ అధ్యక్షుడిగా భాద్యలు నిర్వహిస్తున్న కోగంటి సత్యంపై అసత్య ఆరోపణలు చేసి ఆరెస్టు చేయించడం సరైన చర్యకాదన్నారు. అధికారాన్ని అడంపెట్టుకుని ఒక లైసెన్స్ ఉన్న రౌడీలా బొండా ఉమా వ్యవహరిస్తున్నరని విమర్శించారు. బొండా ఉమా ముందుగా తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని, వారు మంచి బాటలో నడిచేవిదంగా చూడాలని హితవుపలికారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కర్రి సాంబయ్య, రఘు, గుంజా బాబాలాల్ పాల్గొన్నారు.