dundi ganesh
-
ఎమ్మెల్యే బోండా ఉమాపై కోగంటి సత్యం ఫైర్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన విజయవాడలో డుండి గణేష్‌ను దర్శించుకున్నారు. డుండి గణేషుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోండా ఉమాపై కోగంటి సత్యం నిప్పులు చెరిగారు. డుండి గణేష్ ఉత్సవాలను దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బోండా ఉమా గుండాలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి తనను తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు విమర్శించారు. ఎమ్మెల్యే బోండా రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని కోగంటి సత్యం తెలిపారు. -
డూండీ గణేష్ ఉత్సవాలకు రాజకీయ రంగు
విజయవాడ : బెజవాడలో డూండీ గణేష్ ఉత్సవాలకు టీడీపీ నేతల అత్యుత్సాహంతో రాజకీయ రంగు పులుముకుంది. ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ప్రచార్భాటానికి తెర లేపారు. కళాశాల ప్రాంగణమంతా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఫొటోలను ఏర్పాటు చేశారు. దీంతో ఆధ్యాత్మిక కార్యక్రమం కాస్త పచ్చపార్టీ ఉత్సవంగా మారింది. టీడీపీ నేతల తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఎమ్మెల్యే పేరు రాకూడదంతే!
విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. గత ఏడాది చవితి నిర్వహణలో రూ.30 లక్షలకు పైగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోగంటి సత్యం బహిరంగగా విమర్శించడం తెలిసిందే. దీంతో కొంతమంది సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఇక ఆ ప్రజాప్రతినిధి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. సంగీత కళాశాలలో తన అనుచరులతో నిఘా పెట్టి అనుక్షణం ఏం జరుగుతోందో ఆరా తీస్తున్నారు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రాంగణంలో భారీగా విరాళాలు ఇచ్చిన వారిపేర్లను బహిరంగంగా ప్రదర్శించారు. గతంలో మాదిరే ఈ ఏడాది కూడా ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్షరూపాయలను విరాళంగా అందజేశారు. అయితే విరాళాల పట్టికలో మాత్రం ఎమ్మెల్యే పేరు కనిపిం చడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి మంత్రాంగమే దీనికి కారణమని వినిపిస్తోంది. భారీగా చందాల వసూళ్లు.. విగ్రహ నిర్మాణం కోసం నిర్వాహకులుసెంట్రల్ నియోజక వర్గపరిధిలోని దుకాణాల నుంచి భారీగా చందాలు వసూలు చేస్తున్నారు. చందాలకు రసీదులు కూడా ఇవ్వటం లేదని కొందరు దాతలు చెబుతున్నారు. కాగా, కమిటీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు తిష్టవెయ్యటం విమర్శలకు తావిస్తోంది.