కైకలూరు: రాష్ట్రంలో ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలవడంతో ఆ రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంపై శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. ఆ తర్వాత ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీని ఏర్పాటుచేయడం, వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించడాన్ని వారు స్వాగతిస్తున్నారు.
నిజానికి.. ఆక్వా ఉత్పత్తుల విక్రయ ప్రక్రియలో సిండికేట్లు చెప్పిందే రేటు. రొయ్యల సాగును చంటి బిడ్డల్లా సాకిన రైతుల కష్టానికి వీరి చర్యలతో తగిన ప్రతిఫలం దక్కడంలేదు. సిండికేట్లు ఎంత చెబితే అంత రేటుకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ రొయ్యల ధరను నిర్ణయిస్తోంది. ఏపీలో ఆ రేట్లు అమలుకావడంలేదు. మరోవైపు మేతల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. సిండికేట్లు ఇలా దోపిడీ చేస్తుండడంతో రైతులు, రైతు సంఘాల నేతలు శనివారం సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా.. ఆయన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
ఆక్వా రంగాన్ని సీఎం జగన్ అన్ని విధాలా ఆదుకుంటున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం ఉత్పత్తుల రవాణాకు అవకాశం కల్పించారు. ఆక్వా సాగులో మేతల రేట్లు పెరిగి, విక్రయ రేట్లు తగ్గాయి. మేతల ధరల పెంపుపై సీఎం కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆయనకు రుణపడి ఉంటాం.
– బలే నాగరాజు, ఏలూరు జిల్లా ఉత్తమ ఆక్వా రైతు, కొవ్వాడలంక, మండవల్లి మండలం
ఆక్వాకు సర్కార్ అధిక ప్రాధాన్యం
ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య సాగుతోంది. ముఖ్యంగా రొయ్యల సాగులో గిట్టుబాటు ధర రావడంలేదు. రేట్ల నిర్ణయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం ఆకా>్వ రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. రేట్లు, మేతల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలి.
– మంగినేని రామకృష్ణ, రొయ్యల రైతు, కైకలూరు
Comments
Please login to add a commentAdd a comment