
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ 6న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది వేస్తానంటూ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనకు ఎవరి ఉద్దేశాలతో, తీర్పులతో పని లేదని సాధ్వి ప్రాచి తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని హిందువులందరికి ఇదే నా ఆహ్వానం. రామ మందిర నిర్మాణంలో పాల్గొనండి. ఈ డిసెంబర్ 6న ధూమ్ ధామ్‌గా వెళ్లి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. ఇందుకు మనకు ఎవరి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పండి’ అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment