december 6th
-
డిసెంబర్ 6న రామ మందిర నిర్మాణం ప్రారంభం : సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ 6న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది వేస్తానంటూ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనకు ఎవరి ఉద్దేశాలతో, తీర్పులతో పని లేదని సాధ్వి ప్రాచి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని హిందువులందరికి ఇదే నా ఆహ్వానం. రామ మందిర నిర్మాణంలో పాల్గొనండి. ఈ డిసెంబర్ 6న ధూమ్ ధామ్‌గా వెళ్లి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. ఇందుకు మనకు ఎవరి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పండి’ అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ మాత్రమే రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉందని తెలిపారు. -
నెల రోజులే గడువు
ఆలమూరు (కొత్తపేట): కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు నెల రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు అభ్యుదయం సంఘం ఆలమూరులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే నెల ఆరున జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి లోపు కాపులను బీసీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాపు సామాజికవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు వ్యూహం రూపొందించుకుంటామన్నారు. ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా కాపు మేధావులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువత, మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. ఇప్పటికే చాలమంది కాపు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారని, రానున్న నెల రోజుల్లో మరిన్ని అభిప్రాయాలు సేకరించి, దానికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ముద్రగడ చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ సీఎం తన మంత్రివర్గ సభ్యులతో పలికిస్తున్న చిలక పలుకులను కాపు సామాజికవర్గం నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది కాపు నేతలను అమరావతి తీసుకువెళితే ఏదో ఒక శుభవార్త వింటామని ఎదురుచూసిన కాపు జాతికి నిరాశే మిగిలిందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కాపు రిజర్వేషన్ల అమలుపై కప్పదాటు వైఖరి ప్రదర్శించి, కాపు నేతల చెవిలో క్యాబేజీ పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందువల్లనే చివరిగా వచ్చే నెల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తరలిరావాలి ఈ నెల 12న కిర్లంపూడిలో కాపు నేతల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు దళితులు, కాపు నేతలు అధిక సంఖ్యలో తరలిరావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌కు లక్షలాది విగ్రహాలు ఏర్పాటు చేసినా విధించని నిబంధనలు కిర్లంపూడిలో మాత్రమే విధించడంపై ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. పోలీసుల పడగ నీడలో జీవితాలను గడపాల్సిన దారుణమైన పరిస్థితులను కల్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వై.ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నయనాల హరిశ్చంద్రప్రసాద్, దున్నాబత్తుల నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఖాకీ’.. ఏకాకి!
భరోసా లేని హోంగార్డుల ఉద్యోగాలు ఎన్నాళ్లయినా ‘వెట్టి’పాట్లే.. పని చేస్తేనే వేతనం నేడు హోంగార్డుల దినోత్సవం మెదక్: రాత్రింబవళ్లు డ్యూటీ.. ఏళ్ల తరబడి వెట్టి.. అయినా హోంగార్డుల బతుకులకు భరోసా కరువైంది. పోలీస్ కానిస్టేబుల్‌తో సమానమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగ ధీమా లేకుండా పోతోంది. డిసెంబర్ 6వ తేదీ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా హోంగార్డులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మెదక్ జిల్లాలో 62 పోలీస్స్టేషన్లలో దాదాపు 800 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. అయితే, దాదాపు 20 ఏళ్ల నుంచి పోలీసులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల ‘చలవ’తోనే వీరి జీవితం ఆధారపడి ఉంటోంది. హోంగార్డులకు ప్రత్యేకమైన హక్కులు లేకపోవడంతో ఉద్యోగం గాలిలో దీపమైంది. ట్రాఫిక్, డ్రైవింగ్, లాండ్ అండ్ ఆర్డర్‌తో పాటు అనేక రకాలు విధులు రేయింబళ్లు నిర్వర్తిస్తుంటారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో వెట్టి చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు. ఎన్నేళ్లు అయినా బాస్ ఆర్డర్‌ను తు.చా తప్పకుండా పాటించాలి! లేదంటే ఇంటికి పోవాలి! 2010 నుంచి రిక్రూట్మెంట్ 2010లో హోంగార్డుల రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వం అధికారికంగా కొనసాగించి, రన్నింగ్, లాంగ్ .. హై జంప్, రాత పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించి విధుల్లో చే రినా.. వీరిని పర్మినెంట్ చేయకపోవడం విడ్డూరం. ప్రస్తుత వేతనం రూ.12,000 మాత్రమే ఇస్తున్నారు. ఏ శాఖలో అయిన 8 గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. కానీ, హోంగార్డులు మాత్రం 24 గంటలూ విధుల్లో ఉండాల్సిందే! 1946లో వ్యవస్థ ప్రారంభం హోంగార్డు వ్యవస్థ 1946 డిసెంబర్ 6న మన దేశంలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అంత విశిష్టత వీరి ఉద్యోగాలు ఎందుకు పర్మనెంట్ కావడం లేదో నాయకులకే తెలియాలి. ముఖ్యంగా ఉద్యోగాలను రెగ్యులర్ చేయడంతో పాటు పోలీసులుగా ప్రమోషన్లు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, పీఆర్సీల ద్వారా ఆదుకోవాలని చాలాకాలంగా హోంగార్డులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇష్టం పోలీస్ ఉద్యోగమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. పోలీసులతో సమానంగా ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది. పదేళ్లుగా మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నా. మాపై ప్రభుత్వం దయతలచి రెగ్యులర్ చేయాలి. శ్రీనివాస్, హోంగార్డు, మెదక్ వేతనాలు సరిపోవడం లేదు బియ్యం, కూరగాయల రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మాపై దయతలచాలి. అందరిలాగే మాకూ ప్రమాషన్లు ఇవ్వాలి. మోతిరాం, హోంగార్డు, మెదక్ -
'డిసెంబర్ 6'కు భారీ బందోబస్తు
హైదరాబాద్: బాబ్రీ మసీద్ కూల్చివేతకు గురైన డిసెంబర్ 6న.. వివిధ వర్గాలు ఏటా నిర్వహించే బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడికూడా మొదలుకావడంతో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉన్నందున పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొందరు బ్లాక్ డేకు సిద్ధమవుతుండగా... విజయ్ దివస్ కోసం మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా దక్షిణ మండలం పోలీసులు ఎవరికీ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదు. బందోబస్తు కోసం పోలీస్ సిబ్బందితో పాటు ఆర్ముడ్ రిజర్వుడ్ ఫోర్స్, కమాండో టీమ్స్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లను పెద్ద సంఖ్యలో వినియోగించుకోనున్నారు. చార్మినార్ సందర్శకులకూ.. బ్లాక్ డే నేపథ్యంలో పాతనగరం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. చార్మినార్ ను సందర్శించే పర్యాటకులను సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు ఇతర వస్తువులను చార్మినార్ పైకి అనుమతించడం లేదు. బ్యాగులను తనిఖీ చేసి వాటన్నింటిని ప్రధాన గేటు వద్దే ఉంచుతున్నారు. 144 సెక్షన్ అమలు... ఈ నెల 6వ తేదీన పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురి కంటే ఎక్కువగా గుమికూడ రాదని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే నిర్ధేశిత ప్రార్థనలు, పూజలు యధావిధిగా కొనసాగించుకోవచ్చు నన్నారు. అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. రౌడీషీటర్లపై నిఘా దక్షిణ మండలంలో ఇప్పటికే నమోదైన పేరు మోసిన రౌడీషీటర్లపై నిఘా పెంచారు. ఇటీవల సత్ప్రవర్తన గల రౌడీలపై నమోదైన రౌడీషీట్లను తొలగించినప్పటికీ, వారిని కూడా ఓ కంట కనిపెడుతున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు
నేరేడ్మెట్: డిసెంబర్ 6 బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. నేరేడ్మెట్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.