అల్పసంఖ్యాక వర్గాలపై హిందూ అతివాద శక్తుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోని ఉనాలో జరిగిన అవమానవీయ ఘటన ఒకపక్క దేశాన్ని కుదిపేస్తుండగానే మధ్యప్రదేశ్ లో మహిళలపై ఇలాంటి దురాగతం చోటుచేసుకుంది. మందసార్ రైల్వేస్టేషన్ లో ఇద్దరు ముస్లిం మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు.