Women Beaten Up
-
వివాహేతర సంబంధం.. మహిళను కరెంట్ పోల్‌కు కట్టేసి..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోహతాస్ జిల్లాలోని సింగపూర్‌కు చెందిన ఓ మహిళ గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆమె భర్త దీపక్రామ్, మామ, ముగ్గురు పిల్లలు బాధితురాలిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్, ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు రోహాతస్ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి తెలిపారు. -
లక్నో: సమాజం తలదించుకొనే చర్య
-
చితక్కొట్టిన ఎమ్మెల్యేకే రాఖీ కట్టిన మహిళ
అహ్మదాబాద్ : ఓ మహిళానేత అని కూడా చూడకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవని దాడికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఎంత వేగంగా ఈ ఘటన వైరల్ అయిందో అంతే వేగంగా సెటిల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై సీరియస్ అవ్వడంతో.. 'ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్‌వాణితో దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించండి. ఆమె నా సోదరితో సమానం. మా మధ్య వచ్చిన అవగాహన లోపం వల్లే ఈ ఘటన జరిగింది' అంటూ బలరాం తవని పేర్కొన్నారు. సోమవారం నీతూ తేజ్‌వాణితో కలిసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. యువతితో రాఖీ కట్టించుకున్నారు. కేవలం అవగాహన లోపం వల్లే నిన్నటి ఘటన జరిగిందని అవన్నీ మర్చిపోయి ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పని చేస్తామని బలరాం అన్నారు. నీతూ తేజ్వాణి కూడా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేకు రాఖీ కట్టి బలరాం నా సోదరుడులాంటివాడు, మాది ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చింది. ఒకే రోజులో మ్యాటర్ మొత్తం సెటిల్ అవ్వడంతో .. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన నీతూ తేజ్వాణిపై ఎమ్మెల్యే బలరాం ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నగరంలోని నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే బలరాం తవని నీతూ తేజ్‌వాణిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచినీటి కొరతపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన మహిళపై ఆయన కార్యాలయం వెలుపలే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం తవని గట్టిగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నరోదా వార్డుకు గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన 2017లో నరోదా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గుజరాత్ అసెంబ్లీలోఅడుగుపెట్టారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తన వివాదాస్పదం -
మహిళపై బీజేపీ ఎమ్మెల్యే భౌతిక దాడి
అహ్మదాబాద్ : సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన మహిళపై ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన దుమారం రేపింది. అహ్మదాబాద్ నగరంలోని నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే బలరాం తవని ఓ మహిళను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మంచినీటి కొరతపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన మహిళపై ఆయన కార్యాలయం వెలుపలే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం తవని గట్టిగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. మహిళపై ఎమ్మెల్యే దాడి వీడియో వైరల్ కావడంతో ఇది దురదృష్టకర ఘటన అని, తాను ఆమెకు క్షమాపణ చెబుతానని బలరాం తవన్ పేర్కొన్నారు. కాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నరోదా వార్డుకు గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన 2017లో నరోదా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గుజరాత్ అసెంబ్లీలోఅడుగుపెట్టారు. మరోవైపు ఇదే తరహా ఘటనలో బాధితులపై భౌతికదాడికి పాల్పడిన ఉదంతంలో బలరాం తవని సోదరుడు కిషోర్ తవని నిందితుడిగా ఉన్నట్టు చెబుతున్నారు. -
మహిళలపై దాడి వీడియో కలకలం
-
మహిళలపై దాడి వీడియో కలకలం
మందసార్: అల్పసంఖ్యాక వర్గాలపై హిందూ అతివాద శక్తుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోని ఉనాలో జరిగిన అవమానవీయ ఘటన ఒకపక్క దేశాన్ని కుదిపేస్తుండగానే మధ్యప్రదేశ్ లో మహిళలపై ఇలాంటి దురాగతం చోటుచేసుకుంది. మందసార్ రైల్వేస్టేషన్ లో ఇద్దరు ముస్లిం మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. జయొరా ప్రాంతం నుంచి గోమాంసం తీసుకువచ్చారనే ఆరోపణలతో ఇద్దరు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగానే హిందూ దళ్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇద్దరు మైనారిటీ మహిళలను నోటికొచ్చినట్టు దూషించి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు కింద పడిపోయారు. ప్రత్యక్షసాక్షి ఒకరు వీడియో తీయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. తీరిగ్గా మేలుకున్న పోలీసులు అరగంట తర్వాత ఇద్దరు మహిళలను స్టేషన్ కు తరలించారు. వీరి నుంచి 30 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించిన స్థానిక డాక్టర్లు గొడ్డుమాంసంగా ధ్రువీకరించారు. గొడ్డుమాంసం అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలపై ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా వీరిపై విచక్షణారహితంగా దాడి చేసిన మహిళలు, పురుషులపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.