
అహ్మదాబాద్ : సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన మహిళపై ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన దుమారం రేపింది. అహ్మదాబాద్ నగరంలోని నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే బలరాం తవని ఓ మహిళను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మంచినీటి కొరతపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన మహిళపై ఆయన కార్యాలయం వెలుపలే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం తవని గట్టిగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.
మహిళపై ఎమ్మెల్యే దాడి వీడియో వైరల్ కావడంతో ఇది దురదృష్టకర ఘటన అని, తాను ఆమెకు క్షమాపణ చెబుతానని బలరాం తవన్ పేర్కొన్నారు. కాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నరోదా వార్డుకు గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన 2017లో నరోదా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గుజరాత్ అసెంబ్లీలోఅడుగుపెట్టారు. మరోవైపు ఇదే తరహా ఘటనలో బాధితులపై భౌతికదాడికి పాల్పడిన ఉదంతంలో బలరాం తవని సోదరుడు కిషోర్ తవని నిందితుడిగా ఉన్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment