బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్ | They Raped Us, Called It Punishment For Eating Beef,' Alleged Haryana Woman | Sakshi
Sakshi News home page

బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్

Published Sun, Sep 11 2016 3:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్

బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్

మేవత్: బీఫ్ తిన్నందుకు శిక్షగా తమపై లైంగికదాడి చేసినట్టు నిందితులు చెప్పారని హరియాణాలోని మేవత్ గ్యాంగ్ రేప్ బాధితురాలు చెప్పింది. 'బీఫ్ తింటారా అని నిందితులు అడిగారు. మేం లేదని చెప్పాం. అయితే బీఫ్ తిన్నందుకే శిక్ష (గ్యాంగ్ రేప్) వేశామని చెప్పారు' అని ఢిల్లీలో సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సమక్షంలో ఓ బాధితురాలు చెప్పింది. కాగా ఈ కేసుతో గోసంరక్షక దళం సభ్యులకు సంబంధంలేదని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.

రెండు వారాల క్రితం వరుసకు బంధువులైన ఇద్దరు మహిళల (20, 14)పై దుండగులు వారి ఇంట్లోనే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితుల అత్తమామలను కట్టేసి విచక్షణరహితంగా కొట్టడంతో మరణించారు. పోలీసులు అత్యాచారం కేసు మాత్రమే నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానికులు నిరసన తెలిపిన తర్వాత నిందితులపై హత్యకేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement