Mewat
-
మనుగడకు మరపు మంచిదే!
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే... మతం పేరుతో రెచ్చగొట్టేవారు, లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పిపెట్టేందుకు, లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తిచూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఫలితం శూన్యం. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం, లేదంటే ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకు కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. గతంలోని కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది. హరియాణాలోని మేవాత్, నూహ్‌లో జరుగుతున్న ఘర్షణలు చూస్తూంటే... పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్ గుర్తుకొస్తారు. 1950లలో ఖైరాన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ముస్లిం కుటుంబాలను మేవాత్లోకి రానివ్వమని సూచనప్రాయంగా చెప్పిన వారిని ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరిక అది. దేశ విభజన నేపథ్యంలో ఈ కుటుంబాలు పాక్‌కు వెళ్లాయి. 1950ల మధ్య కాలానికి చాలామంది మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చేశారు. వేలమంది మేవాతీ ముస్లిం కుటుంబాలకు తమ సొంత ఆస్తులు మళ్లీ దక్కేలా ఖైరాన్ చర్యలు తీసు కున్నారు. ‘‘గతం తాలూకు శత్రుత్వాన్ని మరచిపోండి. మీ బాధలపై ఆధారపడి బతక్కండి’’ అని విభజన కారణంగా చెలరేగిన విద్వేష బాధితులైన సిక్కులు, హిందువులకు ఖైరాన్ పదే పదే చెప్పేవారు. కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది. గతాన్ని గుర్తుంచుకోలేని వారు ఆధారం లేనివారవుతారు. బానిస బతుకులు బతికినవారు కూడా ఉజ్వల భవిష్యత్తును కాంక్షించే సందర్భంలో తమ మూలాలను తరచిచూస్తారు. లేదంటే మూలాలను కల్పించుకుంటారు. అదే సమ యంలో గతాన్ని ఏమాత్రం మరచిపోనివారు లేదా ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకూ కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. మన పాత తరాలు నిర్దిష్ట సామాజిక కూర్పుల్లో బతికాయి. ఈ కూర్పులు సాధారణంగా చాలా చిన్నస్థాయిలో ఉండేవి. ముఖాముఖి పరిచయాలు, ఒకరంటే ఇంకొకరికి నమ్మకం వంటివి ఈ కూర్పు తాలూకూ లక్షణాలు. చాలా ప్రాథమిక గుర్తింపుల ఆధారంగా ఈ నిర్మాణం జరిగింది. ఈ కూర్పులో లేనివారితో వ్యవహారం ప్రమాద కరమన్నది వారి అవగాహన. రూపురేఖల్లేని ఆధునికత ఆస్తిత్వంలోకి రావడంతో ఈ అవగాహనలన్నీ మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడేందుకు చాలా సులువైన మార్గం ముఖాముఖి మాటలు, వ్యవహారాలే. ఇలాంటి బంధాలు, తద్వారా ఏర్పడ్డ సామాజిక వర్గాలు సహజంగానే చిన్న సమూహా లుగానే ఉంటాయి. ఇతరులపై వీరి ప్రభావమూ పెద్దగా కనిపించదు. అయితే జాతి, రాష్ట్రమన్న భావనలు ఆవిర్భవించిన తరువాత, ఆధు నిక సమాజం తన మునుపటి దానికంటే విస్తృత స్థాయికి చేరేందుకు అవకాశం కల్పించిన ప్రాథమిక బంధాల విలువ తగ్గిపోయింది. ఆధునిక ప్రపంచ చరిత్ర మొత్తం గతకాలపు అస్తిత్వాలను అణచి పెట్టడం, రూపురేఖల్లేని వ్యవస్థల నిర్మాణమనే చెప్పాలి. ఈ వ్యవస్థలే వ్యక్తులు తమ ప్రాథమిక అస్తిత్వాల బంధాలను తెంచుకుని స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కల్పించాయి. అలాగే పాతకాలపు సామాజిక కట్టు బాట్లు మనుషులను తమ బానిసలుగా చేసుకోకుండా నిలువరించాయి. ఈ వ్యవస్థలన్నింటికీ ఆధారం ‘నేషన్ స్టేట్’. (క్లుప్తత కోసం ప్రభుత్వం అనుకుందాం.) పాతకాలపు సామాజిక ఏర్పాట్లకు కాకుండా ప్రభుత్వ వ్యవస్థకు లొంగిన వ్యక్తులు నేషన్ స్టేట్‌లో ప్రాథ మిక భాగస్వాములు. బల ప్రయోగంతో నేషన్ స్టేట్‌ను ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇది మనదన్న భావన కల్పించడం బలం వల్ల సాధ్యం కాదు. సహజసిద్ధంగా మనుషుల అంతరాంతరాళాల నుంచి పుట్టుకు రావాల్సిన ఫీలింగ్ అది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, నేషన్ స్టేట్‌కు, వ్యక్తికి మధ్య బంధం బలపడటంలో వ్యక్తులు కనుమ రుగు అవుతారన్న భయముంటుంది. ఈ భయంతోనే చాలామంది ఉదార వాదులు కూడా అందరి మంచిని పణంగా పెట్టి మరీ పాత కాలపు సామాజిక కూర్పులవైపు మొగ్గు చూపుతూంటారు. పాతకాలపు సామాజిక ఏర్పాట్లలో శక్తిమంతమైనది మతం అన్నది మరచిపోరాదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వ్యవస్థీకృతమైన మతం ఉపయోగపడుతుంది. ఒక పరమార్థం, ఒక నమ్మకాన్ని కూడా ప్రజలకు ఇచ్చే మతం ఎప్పుడూ ప్రభుత్వం తదితర వ్యవస్థలకు గట్టి పోటీ దారు. భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థలకు సవాళ్లు రాజకీయపరమైన ఇస్లాంతో ముడిపడి ఉన్నాయి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో దేశంలోని ఇస్లామిస్టులు స్వయం పాలన పొందాలంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగానే మతం ఆధారంగా దేశాల నిర్మాణం జరగాలని కాంక్షించారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అసలు చదవనే లేదని గర్వంగా చెప్పుకొనే మౌలానా మొహమ్మద్ అలీ ‘ద కామ్రేడ్’ వార్తా పత్రికలో ఒక కథనం రాస్తూ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. అయితే ఇది దేశ విభజనకు దారితీసే స్థాయిలో ముస్లింలలో వేర్పాటువాదాన్ని సృష్టిస్తుందని ఆయన ఊహించలేకపోయారు. వాస్తవం ఏమిటంటే, భారత్‌లో ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛపై ఎప్పుడూ నియంత్రణ లేదు. విభజన ఘర్షణల తరువాత కూడా రాజ్యాంగ మండలి చర్చల్లో మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దేశం అందరిదీ కాబట్టి మత స్వేచ్ఛ కూడా దానంతట అదే వచ్చినట్లేనని అనుకున్నారు. మత ప్రచారమన్న విషయానికి వస్తే మండలి సభ్యులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మతంలో మతమార్పిడన్న భావన లేదనీ, మత ప్రచారానికి అనుమతిస్తే హిందూమతం అంతమైపోతుందనీ వాదించారు. దీనిపై ఇతర సభ్యులు పాకిస్తాన్ ఏర్పాటును ఉదాహరణగా చూపుతూ, ఇండియాలో ముస్లింలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వంపై ఉన్న అపోహలను తొలగించాలంటే మత ప్రచార హక్కును కల్పించవచ్చునని అభి ప్రాయపడ్డారు. చివరకు ఇదే కార్యాచరణకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం, మతం పేరుతో రెచ్చ గొట్టేవారు లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పి పెట్టేందుకు లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తి చూపేందుకు ప్రయ త్నాలు జరిగాయి. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం లేదా ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగిందేమీ లేదు. ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకుంటే... వాస్తవాలను మరు గున బెట్టి లేదా అబద్ధాలు చెప్పడం ద్వారా వారిని మార్చలేము. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూరప్ చరిత్రను అర్థం చేసుకుని భారతదేశం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. దేశంలోని వైవిధ్యతపై విపరీతమైన నిబద్ధత కలిగి ఉండటం గురించి ముందుగా అర్థం చేసు కోవడం మంచిది. వైవిధ్యత మనకు మాత్రమే సొంతమని అనుకుంటూ ఉంటాం. కానీ చరిత్ర మొత్తమ్మీద ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ వైవిధ్యత ఉందన్నది మరచిపోతూంటాం. మనకు ఇది నమ్మబుద్ధి కాకపోవచ్చు. కానీ యూరప్‌లో చాలా శతాబ్దాలపాటు తమ మతగ్రంథాలను సొంతంగా చదివే స్వేచ్ఛ ఉండాలా, వద్దా? అన్న విషయంపైనే గొడవలు జరిగేవి. మతగురువులు మత గ్రంథాలపై ఇచ్చే వివరణ సరిపోతుందన్నది ఒక వర్గం వాదన. ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకోవడం, సమాజ స్థాయి విస్తరించడంతో యూరోపియన్లు ఇలాంటి గొడవల నుంచి దూరం జరిగేందుకు కొన్ని దారులు వెతుక్కున్నారు. మరి యుగాల కాలం కొనసాగిన పగలేమ య్యాయి? ఒక వర్గం మరోదానిపై చేసిన చారిత్రక తప్పిదాల మాటే మిటి? ఆధునిక దేశం ఒకటి ఏర్పడిన తరువాత వాటన్నింటిని పట్టించుకోలేదు లేదా మరచిపోయారు. ఇలా అన్ని తెలిసి కూడా వాటిని మరచిపోవడం లేకపోతే ఇరు వర్గాలకు అనువైన మార్గంలో ముందుకు పోయేందుకు మరో దారి లేనేలేదు! ఎం. రాజీవ్ లోచన్ వ్యాసకర్త చరిత్రకారులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముఠాలు 25.. నేరస్తులు 100 మంది
సాక్షి, హైదరాబాద్: ‘ఆలీ బాబా నలభై దొంగల’కథ మనం పాఠ్యాంశాల్లో చదివి ఉంటాము గానీ..వాస్తవంగా ఓ పాతిక ముఠాలు..వందమంది నేరస్తుల బృందం పలు నగరాల పోలీసులకు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా జేస్తున్నాయి.రాజస్తాన్‌లోని అల్వార్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, హరియాణాలోని నుహ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ‘మేవాట్’ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నేరస్తులు దేశవ్యాప్తంగా పలుచోట్ల నేరాలకు పాల్పడుతుంటారు. ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న 35 గ్రామాల్లో 100 మందికి పైగా నేరచరితులే ఉన్నారు. వీరి నేతృత్వంలో 25 ముఠాలు పని చేస్తున్నాయి. దాదాపు యువత మొత్తం నేరాలనే తమ జీవనాధారంగా మార్చుకుంది. ఒకప్పుడు దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి ‘హార్డ్‌వేర్’క్రైమ్ చేసిన ఈ గ్యాంగ్స్... ఆ తర్వాతి కాలంలో ‘సాఫ్ట్ దగాలు’మొదలెట్టి సైబర్ నేరాలు, ఏటీఎం ఫ్రాడ్స్ చేస్తున్నాయి. ఏటీఎంలను ఏమారుస్తూ గత వారం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన ముఠా సైతం మేవాట్ రీజియన్‌కు చెందినదే. మేవాట్ తెగకు చెందిన పేదల్లో అధికులు నేరగాళ్లుగానే చెలామణి అవుతున్నారు. వీరు తమ ప్రాంతంలో ‘ప్రవృత్తి’జోలికిపోకుండా తమ సొంత వృత్తుల్నే కొనసాగిస్తారు. వేరే ప్రాంతాల్లో నేరం చేసిన తర్వాత కొంతకాలం పాటు స్వస్థలానికి వెళ్లి అక్కడే ఉంటారు. వీరిని స్థానికంగా పట్టుకోవడం కష్టసాధ్యం. గతంలో ఈ పనిమీదే వెళ్లిన రాజస్తాన్‌కు చెందిన ఓ ఇన్స్పెక్టర్ను జీపుతో సహా వీరు సజీవదహనం చేశారు. అందుకే పోలీసులు కూడా ఆ ప్రాంతం నుంచి వాళ్లు బయటకు వచ్చే వరకు ఆగి కాపుకాసి పట్టుకుంటుంటారు. ఆరు రోజుల్లో నాలుగు దోపిడీలు... మేడ్చెల్‌లోని హనుమాన్ జ్యువెలర్స్‌లో 2011లో దోపిడీ యత్నం చేసిన దుండగులు కాల్పులకు సైతం తెగబడ్డారు. మేవాట్ తెగకు చెందిన ఆరిఫ్, మరో 12 మందితో ముఠా కట్టి ఈ నేరం చేశాడు. ఈ గ్యాంగ్ ఆ ఏడాది మార్చిలో కేవలం ఆరు రోజుల్లోనే నాలుగు నేరాలు చేసింది. ఆపై ఎస్ఓటీ పోలీసులు ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రెండు నాటు తుపాకులు, 10 తూటాలు, 3 డాగర్లు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 14న హనుమాన్ జ్యువెలరీస్‌లో దోపిడీకి యత్నమే ఆఖరి నేరం. ఈ గ్యాంగ్‌కు చెందిన వారిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదే ఏడాది ఏప్రిల్ 3న పట్టుకున్నారు. ఈ–కామర్స్ సైట్స్ ఆధారంగా.. మేవాట్ ముఠాలు గడిచిన రెండేళ్లుగా తమ పంథాను మార్చేశాయి. వీరిలో కొందరు చదువుకున్న వారు చేరడంతో ‘హార్డ్’దందాలు వదిలేసి ‘సాఫ్ట్’మార్గాలు పట్టాయి. ఓఎల్ఎక్స్ తదితర ఈ–కామర్స్ సైట్స్‌ను అడ్డాగా చేసుకుని బోగస్ వివరాలతో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆపై వాటిలో కొన్ని కార్ల ఫొటోలు పోస్ట్ చేసి తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎర వేస్తున్నారు. అనేక సందర్భాల్లో సైన్యం పేరిట, కొన్నిసార్లు వారే ఆ వస్త్రధారణతో ఫొటోలు పెట్టి, ఆయా వాహనాలు కొంటామంటూ ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా డబ్బు డిపాజిట్ చేయించుకుని నిండా ముంచుతున్నారు. ఏటీఎం కేంద్రంగా తాజా పంథా... దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఈ నెల 17న చిక్కిన మేవాట్ ముఠా వీటన్నింటికీ మించిపోయింది. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ పెద్ద స్కెచ్ వేసుకునే నగరంలోకి దిగింది. ఎంజీబీఎస్ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసిన ముఠా సభ్యులు, తమ వెంట పరిచయస్తులు, స్నేహితులు, బంధువుల ఏటీఎం కార్డులు తెచ్చుకున్నారు. వీటిని వినియోగించి డబ్బు డ్రా చేస్తూ చిన్న టెక్నిక్ ద్వారా ఏటీఎం మిషన్‌ను ఏమార్చారు. ఫలితంగా డబ్బు డ్రా కానట్టు కనిపించి ఆ మొత్తం కార్డుదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.లక్ష వరకు డ్రా చేసిన వీరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో పెద్ద స్కామ్ తప్పింది. -
పాకిస్తానీలా ఉన్నావ్ గడ్డం తీసెయ్..!
గురుగ్రామ్ (హరియాణ) : దేశంలో కుల, మతాల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవైపు గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు కొనసాగుతుండగా.. తాజాగా గడ్డం పెంచిన ఓ ముస్లిం యువకుడిపై కొందరు దుండగులు దాడికి దిగారు. బలవంతంగా లాక్కెళ్లి షేవింగ్ చేయించారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సెక్టార్ 29, మేవాత్ ప్రాంతంలో నివాసముండే జఫారుద్దీన్ హమీద్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. ‘పాకిస్తానీలా ఉన్నావ్ గడ్డం తీసెయ్’ అంటూ హుకుం జారీ చేశారు. అతను నిరాకరించడంతో.. ‘నువ్ పాకిస్తానీవి. అందుకే అలా గడ్డం పెంచుకున్నావ్. పాకిస్తానివి కాకపోతే వెంటనే గడ్డం తీసేయ్’ అని దాడి చేశారు. అక్కడితో ఆగకుండా దగ్గర్లో ఉన్న సెలూన్ షాప్‌కు అతన్ని లాక్కెళ్లారు. అక్కడ గడ్డం గీయడానికి బార్బర్ నిరాకరించడంతో.. ఇద్దరినీ కొట్టారు. హమీద్‌ను కుర్చీకి కట్టేసి.. బలవంతంగా గడ్డం గీయించారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భయానకం.. మూగజీవినీ వదల్లేదు
ఛండీగఢ్: దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూగ జీవి.. పైగా గర్భంతో ఉందని కూడా చూడకుండా కొందరు యువకులు మృగ చేష్టలకు పాల్పడ్డారు. సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హింసించి దాని ఉసురు తీశారు. ఘోరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేవాత్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మొత్తం 8 మంది యువకులు మేకపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ సమయంలో దాని అరుపులకు నిద్ర లేచిన యాజమాని అస్లూ జరుగుతున్న ఘోరం చూసి నిశ్చేష్టులయ్యారు. కేకలు వేయటంతో భయపడ్డ నిందితులు పరారయ్యారు. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరోజు తర్వాత అది కన్నుమూసింది. ఈ ఘటనపై నగిన పోలీస్ స్టేషన్లో అస్లూ ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై జంతు పరిరక్షక సంఘాలు, పెటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పెటా ప్రతినిధులు పోలీసులకు కోరుతున్నారు. -
బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్
మేవత్: బీఫ్ తిన్నందుకు శిక్షగా తమపై లైంగికదాడి చేసినట్టు నిందితులు చెప్పారని హరియాణాలోని మేవత్ గ్యాంగ్ రేప్ బాధితురాలు చెప్పింది. 'బీఫ్ తింటారా అని నిందితులు అడిగారు. మేం లేదని చెప్పాం. అయితే బీఫ్ తిన్నందుకే శిక్ష (గ్యాంగ్ రేప్) వేశామని చెప్పారు' అని ఢిల్లీలో సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సమక్షంలో ఓ బాధితురాలు చెప్పింది. కాగా ఈ కేసుతో గోసంరక్షక దళం సభ్యులకు సంబంధంలేదని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. రెండు వారాల క్రితం వరుసకు బంధువులైన ఇద్దరు మహిళల (20, 14)పై దుండగులు వారి ఇంట్లోనే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితుల అత్తమామలను కట్టేసి విచక్షణరహితంగా కొట్టడంతో మరణించారు. పోలీసులు అత్యాచారం కేసు మాత్రమే నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానికులు నిరసన తెలిపిన తర్వాత నిందితులపై హత్యకేసు నమోదు చేశారు. -
చికెన్ బిర్యానీ.. అక్కర్లేదంటున్న కస్టమర్లు
చికెన్ బిర్యానీలో గొడ్డుమాంసం(బీఫ్) వాడుతున్నారనే నిర్థారణ అమ్మకందారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తో అమ్మకందారులు భారీ సంఖ్యలో కస్టమర్లను కోల్పోతున్నారు. బిర్యానీ ఉందా అంటూ వచ్చిన కస్టమర్లు, చికెన్ బిర్యానీ మాట చెప్పగానే ఆమడ దూరం పారిపోతున్నారట. తమకేమీ అక్కర్లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బక్రీద్ సందర్భంగా బిర్యానీలో గొడ్డుమాంసం వాడుతున్నారనే ఫిర్యాదులతో హర్యాణాలోని మెవాత్ జిల్లాలో సేకరించిన రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. సేకరించిన ఏడు నమూనాల్లో బీఫ్‌ను గుర్తించినట్టు హిసార్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నిటీ, యానిమల్ సైన్సెస్ నిర్ధారించిన సంగతి తెలిసిందే. మండాకా గ్రామ సమీపంలోని అమ్మకందారుల నుంచి ఈ నమూనాలను సేకరించారు. దీంతో బిర్యానీ అమ్మకందారులకు తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగులుతోంది. హెచ్‌టీ నిర్వహించిన సర్వేలో రోడ్డు పక్కన బిర్యానీ అమ్మే 30కి పైగా విక్రయదారుల్లో, సగానికి పైగా మంది తమ వ్యాపారాలను వదిలివేసినట్టు తేలింది. మొదటి సారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, తీవ్ర స్థాయిలో కస్టమర్లను కోల్పోవాల్సి వస్తుందని 12 ఏళ్లకు పైగా బిర్యానీ వ్యాపారం చేపడుతున్న మహ్మద్ అక్బర్ అనే విక్రయదారుడు విచారణ వ్యక్తంచేస్తున్నారు. తనతో పాటు ఇతర విక్రయదారులు గోస్ట్ బిర్యానీని అమ్మడం ఎప్పుడో నిలిపివేశామని, బుధవారం అధికారులు వచ్చి తమ బిర్యానీ శాంపిల్స్ కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. శాంపిళ్ల సేకరణకు అధికారులు రావడంతో, నుహ్ మార్కెట్లో 50కి పైగా అమ్మకాలు కోల్పోయినట్టు వాపోయారు. తాము కేవలం చికెన్ బిర్యానీలను మాత్రమే అమ్ముతున్నట్టు తెలిపారు.అయితే బిర్యానీ అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు కోరకోవడం లేదని, ఆవు సంరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే తాము పాటిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బిర్యానీల్లో గొడ్డు మాంసాన్ని నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ సహాయంతో హోటళ్లలో బిర్యానీలను పరిశీలిస్తామని నోడల్ ఆఫీసర్ భారతీ అరోరా తెలిపారు. -
మరో ఉగ్రవాది హర్యానాలో అరెస్టు
న్యూఢిల్లీ: హర్యానాలో అల్ కాయిదా ఉగ్రవాదిని అరెస్టు చేశారు. మెవాత్ జిల్లాలో అబ్దుల్ సమి అనే వ్యక్తిని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి అనంతరం ఇది ఐదో అరెస్టు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల పట్టుకునే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి అనువణువూ శోధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఢిల్లీకి చెందిన ప్రత్యేక పోలీసులు మేవాత్ అనే ప్రాంతంలో సమిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు తరలించగా అతడికి ఫిబ్రవరి 1వరకు కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. సమిది జార్ఖండ్ లోని జంషెడ్ పూర్. ఇప్పటికే అరెస్టు అయిన మిగితా నలుగురు వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక్కోతీరుగా సహాయం చేసేవారని తెలిసింది.