ఛండీగఢ్: దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూగ జీవి.. పైగా గర్భంతో ఉందని కూడా చూడకుండా కొందరు యువకులు మృగ చేష్టలకు పాల్పడ్డారు. సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హింసించి దాని ఉసురు తీశారు. ఘోరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేవాత్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మొత్తం 8 మంది యువకులు మేకపై దాష్టీకానికి పాల‍్పడ్డారు. ఆ సమయంలో దాని అరుపులకు నిద్ర లేచిన యాజమాని అస్లూ జరుగుతున్న ఘోరం చూసి నిశ్చేష్టులయ్యారు. కేకలు వేయటంతో భయపడ్డ నిందితులు పరారయ్యారు.
వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరోజు తర్వాత అది కన్నుమూసింది. ఈ ఘటనపై నగిన పోలీస్ స్టేషన్‌లో అస్లూ ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై జంతు పరిరక్షక సంఘాలు, పెటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పెటా ప్రతినిధులు పోలీసులకు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment