గోవధ నిషేధం, గొడ్డుమాంసం నిషేధం, బీఫ్ బచావో వంటి విషయాల మీద చర్చ పాతదే. చిర కాలంగా తేలకుండా ఉండిపోయిన మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లుకు ఈ మార్చి 2న రాష్ట్రపతి ఆమోదం తెలియచేయడంతో మరోమారు ఈ అంశం చర్చకొచ్చింది.
గోవధ నిషేధం, గొడ్డుమాంసం నిషేధం, బీఫ్ బచావో వంటి విషయాల మీద చర్చ పాతదే. చిర కాలంగా తేలకుండా ఉండిపోయిన మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లుకు ఈ మార్చి 2న రాష్ట్రపతి ఆమోదం తెలియచేయడంతో మరోమారు ఈ అంశం చర్చకొచ్చింది. మహారాష్ట్రలో ఇప్పుడు గొడ్డుమాం సం నిషిద్ధం. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పాటు, గోవధను నిషేధించాలని 2003లోనే బీజేపీ ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితలు మే 24, 2015న సమావేశమై ‘బీఫ్ బచావో’ పేరుతో ఆందోళన చేపట్టినట్లు వార్త వచ్చింది. గత జనవరిలో జరిగిన హనుమకొండ విరసం సభల్లో బీఫ్ పలావ్ వడ్డించినట్లు, దాన్ని తిం టున్న వరవరరావు ఫొటో పత్రికలలో వచ్చింది.
బీఫ్‌ను నిషేధించాలన్న వాదనకు బీజేపీ, హిందుత్వవాదులు‘పవిత్రత’ ఒక్కటే కారణంగా చూపు తున్నారు. తినేవారు చాలా కారణాలు చెబుతు న్నారు. అందులో కొన్ని - ఆది మానవుడు మాంసా హారిగా ఉండకపోతే పరిణామక్రమం ఆగిపోయుం డేది. గోమాంసం తినటం కారణంగా పాశ్చాత్యులు మేధాశక్తిలో ముందున్నారు. ఇది దళితులపైన, వారి ఆహారపు అలవాట్లపైన మనువాదుల దాడి. గొడ్డు మాంసం తింటున్న కారణంగా దళితుల్ని అస్పృశ్యు లుగా చూస్తున్నారు. గొడ్డు మాంసంలో చాలా పోష కాలున్నాయి. ఈ ఆహారానికి కూడా నెయ్యి, పాలు, పెరుగు, పప్పులతో సమాన గౌరవం ఇవ్వాలి. ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ సందర్భంలో మరి న్ని విపరీత ధోరణులు వ్యక్తమయ్యాయి. నలమాల కృష్ణ ఒక వ్యాసంలో ఇది కోస్తాంధ్ర దోపిడీ వర్గం తెలంగాణ ప్రజల ఆహారంపై చూపిస్తున్న వివక్ష అని పేర్కొనగా, శాకాహార సంస్కృతి బ్రాహ్మలది - మాంసాహార సంస్కృతి బహుజనులది అని డా॥గాలి వినోద్ అన్నాడు. దళితులు మాంసాహారులు, బ్రాహ్మణులు శాకాహారులు అని చెప్పటం ఎంత అసత్యమో! ఎంత అశాస్త్రీయమో! ఒక ఆహారపు అలవాటును నీచంగా భావించటం ఎంత తప్పో - ఆ అలవాటు లేనివాళ్లను ఎద్దేవా చేయటమూ తప్పే.
మావోయిస్టు నాయకుడు మిడ్కో ఒక వ్యాసం లో ‘అటవీ ప్రాంతంలో గొడ్డు, పందితో పాటు ఎం డ్రకాయలు, ఎలుకలు, పందికొక్కులు, కప్పలు, పాములు, నత్తలు, చీమలు వంటివి తింటారు. అవి తినటం రాడికల్స్ ఒక ముఖ్యమైన అర్హతగా భావి స్తారు. అలా తినటం చైతన్యానికి ప్రతీక, డీక్లాసిఫై అయ్యారని చెప్పుకోవటానికి గీటురాయి. విప్లవోద్య మం ఒక్క గొడ్డు మాంసం తినే అలవాటునే కాదు, చాలా మంది నీచంగా భావించే పంది, మరెన్నో రకాల మాంసాలను, అట్టడుగు వర్గాలు తినే వేటి నైనా గౌరవించటమే కాదు సొంతం చేసుకుం టున్నది.
కోడి, మేక మాంసాలను మాత్రమే తింటూ పంది, గొడ్డు వంటి మాంసాలను తినటానికి వెనుక బడటం డీక్లాసిఫై కావటంలో వెనుకబడటమే. ఈ మాంసాలను తినకపోవటం చైతన్యరాహిత్యమే అనేది తమ పార్టీలో స్థిరపడిపోయిందని చెప్పాడు. ‘డీక్లాసిఫై’ అవటం అంటే శ్రామిక జన సంక్షేమం కోసం పాటుపడటమే గాని అలవాటు లేని ఆహా రాన్ని తినటం కాదు. అడవుల్లో ఉన్నప్పుడు ఆహారం అందుబాటులో లేకుంటే, అప్పుడు దొరికే మాంసం తినటం అనివార్యం. వారు అనుభవించే బాధలు జ్ఞప్తికి తెచ్చుకోవటానికి బీఫ్ పలావ్ తింటున్నామని ఒక విప్లవ రచయిత చెప్పినట్లు (హనుమకొండ సభల్లో) పత్రికల్లో వచ్చింది.
అదే నిజమైతే అడవుల్లో వారికి అందుబాటులో లేని అనేక సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తూ ఒక్క గొడ్డు మాంసం విషయం అనుస రిస్తే ఎలా సరిపోతుంది? వాటంగా ఉందని గొడ్డు మాంసం పలావ్ ప్లేట్లు ప్లేట్లు లాగించిన విప్లవ రచ యితలు మిడ్కో చెప్పిన పాములు, చీమలు, ఎలు కలు, పందికొక్కుల్ని మరిచారు. అవి కూడా తినగలి గితే మరింత ‘డీక్లాసిఫై’ అవచ్చుకదా!
బీఫ్ నిషేధించాలని హిందుత్వశక్తులు ఒక వైపు, బీఫ్ సహపంక్తిలో వడ్డించాలని కుల సంఘా లు, రాడికల్స్ మరోవైపు విద్యాలయాల్లో శాంతియు త వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు శాసనాల ద్వారా నియంత్రిం చాలనే ప్రభుత్వ ధోరణి - ఆందోళనల ద్వారా అల వాటు లేని వాళ్లని ఇబ్బంది పెట్టాలనే వారి ధోరణి రెండూ సముచితాలు కావు. ముస్లిం మైనారిటీల పక్కన కూర్చొని పందిమాంసం తినగల సాహసం లేనప్పుడు ఆవు మాంసం బ్రాహ్మణుల పక్కనో, అలవాటు లేని మాంసాహారి పక్కనో కూర్చొని తినా లనుకోవటంలో ఔచిత్యం ఉందా?
- చెరుకూరి సత్యనారాయణ గుంటూరు
మొబైల్: 98486 64587