'బీఫ్ నా ఫేవరెట్ ....కానీ నాన్న వద్దన్నారు'
మరో సినీనటి శాకాహారి జాబితాలో చేరిపోయింది. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా?... కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్. ఒకప్పుడు బీఫ్ తన ఫేవరెట్ అన్న ఈ చెన్నై చిన్నది ఇప్పుడు మాత్రం పక్కా వెజ్టేరియన్గా మారిపోయింది. నాన్న సలహాతో శ్రుతి నాన్ వెజ్ను పక్కన పెట్టేసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో స్వయంగా వెల్లడించింది. మా బాపూజీ (కమల్ హాసన్)కి థాంక్స్. ఆయన సలహాతో నేను వెజిటేరియన్గా మారాను. చాలా బాగుంది, కాని రొయ్యలు తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటూ ట్వీట్ చేసింది.
ఇక బీఫ్ తిని ఏడాదిన్నర అయినట్లు శ్రుతి తెలిపింది. ఇక టర్కిష్, జపనీస్ ఫుడ్కి అభిమానిని అని చెప్పుకొచ్చింది. ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకునే తాను ఇక నుంచి వెజ్టేరియన్గా అవతారం ఎత్తినట్లు శ్రుతి పేర్కొంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో శ్రుతి అగ్ర హీరోయిన్ల రేసులో ఉంది. దాంతో ఆరోగ్యం కాపాడుకోవటంతో పాటు, ఫిట్నెస్గా ఉండాలంటే నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేయమని కమల్ కూతురికి సలహా ఇచ్చారట.
దాంతో ఆమె ప్రస్తుతం అదే పనిలో ఉంది. శాకాహారిగా ఉండడం తననెంతో ఆరోగ్యంగా ఉంచుతోందని, ఒకప్పుడు ఏది పడితే అది తినేసేదాన్ని గానీ, ఇకనుంచి కాస్త బ్యాలెన్స్గా మెయిన్టైన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. తన తండ్రి వెజిటేరియన్ కాకపోయినా ఆయన సలహా పాటిస్తానని శ్రుతి తెలిపింది. తండ్రి సలహాతో జిహ్వ చంపుకుంటున్న ఈ అమ్మడు ఇక నుంచి కొత్త లైఫ్ స్టయిల్ను ఎంజాయ్ చేస్తానంటోంది.