ముంబై: తనపై వచ్చిన విమర్శలపై బాలీవుడ్ నటి కాజోల్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో పోస్ట్ చేయగా.. నటి కాజోల్ గోమాంసం (బీఫ్) తిని పైగా ఆ వీడియోను అప్‌లోడ్ చేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నటి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 'మీరు ఊహించింది, ప్రచారం చేసింది తప్పు. ముంబైలో నా ఫ్రెండ్ రియాన్ స్టీఫెన్ ఇచ్చిన విందుకు వెళ్లిన మాట వాస్తవమే. వీడియోలో ఉన్న డిషెష్ లో మీరు చూసింది బఫెలో మాంసం (దున్నపోతు). ఆ మాంసంపై ఎలాంటి నిషేధం లేదు.
ఈ విషయం చాలా సున్నితమైన అంశం. అందుకే నేను తప్పక వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలుసు. దీనిపై సమాధానం చెప్పకపోతే ఇతరుల మత విశ్వాసాలు దెబ్బతినే అవకాశం ఉంది. నా చేతులు నరికివేయాలంటూ ఎందరో తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారికి నా జవాబిదేనని చెబుతున్నా' అని కాజోల్ తేల్చిపారేవారు. బీఫ్ వండినందుకు మీ ఫ్రెండ్ చేతులు నరికివేయాలని కూడా కామెంట్లు రావడంతో తాను పోస్ట్ చేసిన వీడియోను, ఫొటోలను కూడా డిలీజ్ చేశారు కాజోల్. ఆదివారం జరిగిన ఈ పార్టీకి మలైకా ఆరోరా, దియామిర్జా, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం తమిళ మూవీ వీఐపీ-2 లో ధనుష్‌తో కలిసి నటిస్తోంది.
— Kajol (@KajolAtUN) 1 May 2017