షారుఖ్-బిగ్ బీ డ్యాన్సింగ్ ట్వీట్లు!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు పనిచేయడమంటే చాలా ఇష్టం. ఇక కాజోల్తో డ్యాన్స్ చేయడమంటే మరింత ఇష్టపడతారు. ప్రస్తుతం 'దిల్వాలే' షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్న షారుక్ ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే తాము రాత్రంతా కలిసి డ్యాన్స్ చేసినా.. ప్రపంచంలోనే తామే బెస్ట్ చెత్త డ్యాన్సర్లు అని ఒప్పుకోకతప్పదంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విభేదించారు. మీరు చెత్త డ్యాన్సర్లు కాదు.. ఉత్తమోత్తమ డ్యాన్సర్లు. నేనే పరమచెత్త డ్యాన్సర్ను అంటూ అమితాబ్ ట్వీస్టు ఇచ్చారు. బాద్షా, బిగ్ బీ మధ్య జరిగిన ఈ ఆసక్తికర ట్వీట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆ వ్యాఖ్యలు ఇవి..
'పనిచేయడం కన్నా మించినదేది నాకు లేదు. ఇక రాత్రంతా కాజోల్ తో డ్యాన్స్ చేయడమంటే మరింత బాగుంటుంది. అయితే ప్రపంచంలో మే చెత్త బెస్ట్ డ్యాన్సర్లం. ఇది నిజాయితీగా ఒప్పుకుంటున్నాను' అని షారుఖ్ ట్వీట్ చేశాడు. దీనికి అమితాబ్ రీప్లై ఇస్తూ 'షారుక్. ఇది తప్పు. మీరిద్దరు ఉత్తమోత్తమ డ్యాన్సర్లు. నేనే పరమచెత్త. రాత్రంతా నర్తించి నాకు నేను తేల్చిన విషయమిది. హ్హు.!' అని వ్యాఖ్యానించారు.