Local train - Platform
-
ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ముంబై: మహిళల మధ్య జరిగే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని చూస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అచ్చం ఇలాగే ఓ చిన్న విషయంపై కొందరు మహిళలు గొడవ పడ్డారు. ముంబై లోక్‌ల్ ట్రైన్లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ రైలు మహిళల కంపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం.. తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్ ఎక్కారు. ట్రైన్లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు. చదవండి: వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..! అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మహిళలు గొడవ పడుతుండటంతో అక్కడున్న మిగతా ప్రయాణికులు దూరంగా వెళ్లియారు దీంతో కొద్దిసేపు ట్రైన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Fight between two female passengers over a seat in Mumbai Local Train. #MumbaiLocal #Fight #ViralVideo #Mumbai pic.twitter.com/A7GiedIUvJ — AH Siddiqui (@anwar0262) October 6, 2022 -
బెంబేలెత్తించిన లోకల్రైలు
ప్రయాణికులతో నిత్యం రద్దీగా తిరిగే లోకల్రైలు ప్రమాదానికి గురై ప్రయాణికులను భయపెట్టింది. ప్లాట్‌ఫామ్‌ను ఢీ కొట్టడంతో, ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.టీనగర్: నగరంలో 50 శాతానికి పైగా ప్రజలు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు లోకల్రైలు పైనే ఆధారపడతారు. టిక్కెట్ ధర స్వల్పం కావడంతో ఎల్లవేళలా రద్దీగానే ఉంటుంది. బీచ్‌స్టేషన్-తాంబరం, బీచ్స్టేష న్-చెంగల్పట్టు మార్గాల్లో తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లోకల్‌రైళ్లు సేవలందిస్తుంటాయి. ఎప్పటిలాగానే ఉదయం 10.20 గంటలకు వేలాచ్చేరి స్టేషన్ నుంచి బీచ్‌స్టేషన్ వైపు బయలుదేరిన లోకల్రైలు సెంట్రల్ స్టేషన్ ఎదురుగా ఉన్న పార్క్స్టేషన్కు చేరుకుంటున్న తరుణంలో పెద్ద శబ్దం చేస్తూ పట్టాలు తప్పింది. బోగీలు ప్లాట్‌ఫామ్ పైకి దూసుకురావడంతో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు పెట్టెలు రాసుకోవడంతో ప్లాట్‌ఫామ్ సిమెంటు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. దీంతో రైలు బోగీలోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెంటనే రైలును డ్రైవర్ నిలిపివేశారు. రైలు దిగే హడావుడిలో తోపులాటలో కొందరు గాయపడ్డారు. రైలు పట్టాలు దిగడంతో దీనిని మళ్లీ నడిపేందుకు వీలుకాలేదు. దీంతో అటువైపుగా వస్తున్న రైళ్లను వెంటనే నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే బేసిన్ బ్రిడ్జి నుంచి రైల్వే సిబ్బంది సంఘటనా ప్రాంతం చేరుకున్నారు. మళ్లీ రైలును పట్టాలపై నిలబెట్టారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు పార్కు స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేలచ్చేరి నుంచి వచ్చిన రైళ్లను మైలపూరు వరకు నడిపి తిప్పిపంపారు. మరమ్మతు పూర్తి చేసేవరకు కొన్ని రైళ్లను నిలిపివేశారు. ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. -
‘గ్యాప్ ఫిల్లర్’తో ప్రమాదాలకు చెక్
సాక్షి, ముంబై: లోకల్ రైలు-ప్లాట్ఫారం మధ్యనున్న ఖాళీ స్థలంలో నుంచి కిందపడి అనేక మంది ప్రా ణాలు, మరికొందరు కాళ్లు, చేతులు పొగొట్టుకుం టున్నారు. ఇలాంటి సంఘటనలకు అరికట్టేందుకు రైల్వే పరిపాలన విభాగం తమ వంతుగా చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నంత మేర ఫలితాలను ఇవ్వ డం లేదు. దీంతో వీటికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టేం దుకు ముంబైలోని ఐఐటీకి చెందిన ‘ఇండియన్ డిజైనర్ సెంటర్’ విద్యార్థులు ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ‘ర బ్రీ ప్లాట్ఫారం గ్యాప్ ఫిల్లర్స్’ పేరిట రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. అం దుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని నిర్దేశిత స్టేషన్లలో ముందుగా ఏర్పాటు చేస్తారు. మంచి ఫలితాలు వస్తే అన్ని స్టేషన్లలో, అన్ని ప్లాట్‌ఫారాలపై ఈ రబ్బ రు పరికరాన్ని ఏర్పాటు చేస్తారని దీన్ని తయారుచేసిన అరుణ్‌రాజ్ అనే విద్యార్థి చెప్పారు. దీనివల్ల ప్లాట్ఫారం-లోకల్ రైలు బోగీ మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఈ రబ్బరు పరికరం ద్వారా పూర్తిగా మూసుకుపోతుంది. రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో అదుపుతప్పి ప్రయాణికులు కిందపడే అవకాశముండదని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ముంబై లోకల్ రైళ్లలో ప్రతీరోజు దాదాపు 75 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా ఈ రైళ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో తోపులాటలు పరిపాటే. ఈ గందరగోళంలో అదుపుతప్పి ఖాళీ స్థలంలోంచి ప్రయాణికులు కిందపడుతున్నారు. ఇందులో కొందరి ప్రాణాలు పోగా, మరికొందరు తమ అవయవాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు రాసేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని, ఉద్యోగానికి వెళుతున్న ఓ యువతి, మరో మహిళ ఇలాగే కిందపడి చేతులు పొగొట్టుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటనలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి సంఘటనలు ప్రతీరోజు నగరంలో ఏదో ఒక స్టేషన్లో జరుగుతూనే ఉంటాయి. ప్లాట్ఫారం-రైలు మధ్యలో 20- 25 ఇంచ్‌ల ఖాళీ స్థలం ఉంటుంది. ఇందులో నుంచి మనిషి సులభంగా కింద పడిపోతాడు. ఈ ఖాళీ లేకుండా చేయాలని తలంచి 24 స్టేషన్లలో ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేశారు. చివరకు రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. త్వరలో కొన్ని కీలకమైన స్టేషన్లలో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా బిగిస్తామని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు తెలిపారు.