పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..! | Woman fights off daughter is would-be kidnapper, and video goes viral | Sakshi
Sakshi News home page

పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..!

Published Thu, Jun 9 2016 9:06 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..! - Sakshi

పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..!

పట్టపగలు తల్లి కళ్లెదుటే ఆమె కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆమె చూస్తుండగానే మైనర్ బాలికనుఈడ్చుకెళ్తున్నాడు. అక్కడే ఉన్న తల్లి చాలా కష్టపడి కూతుర్ని రక్షించుకుని ఊపిరి పీల్చుకుంది. పోలీసులు త్వరగానే స్పందించి సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. ఓ తల్లి, కూతురు కిరాణా సామాన్లు కొనేందుకు ఫ్లోరిడాలోని హెర్నాడోలో షాపింగ్ మాల్ కు వెళ్లారు. ఇంతలో అక్కడికి క్రేయిగ్ బొనెల్లో అనే కిడ్నాపర్ వచ్చాడు.

షాపింగ్ చేయడానికి వచ్చినట్లుగా కాసేపు నటించాడు. చుట్టుపక్కల అటూఇటూ చూసి ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆ వెంటనే బాలికను ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న బాలిక తల్లి కూతురి అరుపులతో అప్రమత్తమైంది. మొదట షాక్ తిన్నా, వెంటనే తేరుకుని కూతుర్ని రక్షించుకుంది. చిన్నారిని కిడ్నాపర్ ఈడ్చుకెళ్తుంటే కూతురిని గట్టిగా పట్టుకుని అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆమె గట్టిగా అరవడంతో క్రెయిగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

బాలికను కిడ్నాప్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించిన వీడియోను సిట్రస్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇక అంతే ఆ వీడియోకు భారీ స్పందన వస్తోంది. ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో కేవలం 30 గంటల వ్యవధిలోనే 2.37 లక్షల మంది వీడియోను వీక్షించగా, లక్షల మంది వీడియోను షేర్ చేశారు. గత పదేళ్లలో ఇలాంటి తరహా కిడ్నాప్ ప్రయత్నం తాను చూడలేదని, అతడు ఉద్దేశపూర్వకంగానే స్టోర్ లో అందరూ చూస్తుండగానే చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడని ఫేస్ బుక్ యూజర్ క్రెయిగ్ కల్లాహన్ అభిప్రాయపడ్డాడు. తల్లి కళ్లెదుట, పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన విషయంపై వీడియో చూసిన తర్వాత తాను నిజంగానే భయపడ్డానని మరో యూజర్ మారీ బ్రూక్స్ కామెంట్ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement