daughter kidnap
-
కరిష్మా కిడ్నాప్ కేసులో కీలక మలుపు
సాక్షి, పెరంబూరు: టీనగర్‌కు చెందిన సినీ ఫైనాన్సియర్, వజ్రాల వ్యాపారి ముకుల్ చంద్ బోద్రా కందువడ్డీ కేసులో ఇద్దరు కొడుకులతో సహా అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా బోద్రాకు కరిష్మా బోద్రా(33) అనే కూతురు ఉంది. ఈమె గత నెల 28 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బోద్రా స్థానిక టీనగర్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బోద్రా మంగళవారం(06-03-2018) రాత్రి తండ్రికి పోన్ చేసి తాను ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఒక పాఠశాలలో ఉన్నట్లు చెప్పింది. ఆ సమాచారాన్ని బోద్రా స్థానిక తేనాంపేట పోలీసులకు చేరవేశారు. దీంతో ఒక ప్రత్యేక బృందం గుంటూరు వెళ్లి కరిష్మా బోద్రాను అదుపులోకి తీసుకుని విచారించింది. తండ్రి తనను కొట్టి, హింసించడంతోనే తాను పారిపోయాననీ కరిష్మా బోద్రా పోలీసులకు చెప్పారు. మొదట స్థానిక నుంగంబాక్కంలోని తాను చదివిన పాఠశాలకు వెళ్లాననీ, ఆ తర్వాత గుంటూరులో ఉన్న ఓ పాఠశాలకు వచ్చానని పేర్కొన్నారు. కుమార్తె కోసం బోద్రా కూడా గుంటూరు వెళ్లారు. అక్కడ కూతురిని తనకు అప్పగించవలసిందిగా పోలీసులను కోరారు. కేసు నమోదైనా కారణంగా ఆమెను న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా బోద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తన కూతురు ఆచూకీ తానే పోలీసులకు తెలపానన్నారు. అయినా పోలీసులు తన కూతురిని అప్పగించడానికి నిరాకరిస్తున్నారనీ వాపోయారు. అంతే కాకుండా పోలీసులు కూతురిని బెదిరించి తనకు వ్యతిరేకంగా వాంగూల్మం చెప్పించి మళ్లీ జైలుకు పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. -
పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..!
పట్టపగలు తల్లి కళ్లెదుటే ఆమె కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆమె చూస్తుండగానే మైనర్ బాలికనుఈడ్చుకెళ్తున్నాడు. అక్కడే ఉన్న తల్లి చాలా కష్టపడి కూతుర్ని రక్షించుకుని ఊపిరి పీల్చుకుంది. పోలీసులు త్వరగానే స్పందించి సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ తల్లి, కూతురు కిరాణా సామాన్లు కొనేందుకు ఫ్లోరిడాలోని హెర్నాడోలో షాపింగ్ మాల్ కు వెళ్లారు. ఇంతలో అక్కడికి క్రేయిగ్ బొనెల్లో అనే కిడ్నాపర్ వచ్చాడు. షాపింగ్ చేయడానికి వచ్చినట్లుగా కాసేపు నటించాడు. చుట్టుపక్కల అటూఇటూ చూసి ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆ వెంటనే బాలికను ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న బాలిక తల్లి కూతురి అరుపులతో అప్రమత్తమైంది. మొదట షాక్ తిన్నా, వెంటనే తేరుకుని కూతుర్ని రక్షించుకుంది. చిన్నారిని కిడ్నాపర్ ఈడ్చుకెళ్తుంటే కూతురిని గట్టిగా పట్టుకుని అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆమె గట్టిగా అరవడంతో క్రెయిగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించిన వీడియోను సిట్రస్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇక అంతే ఆ వీడియోకు భారీ స్పందన వస్తోంది. ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో కేవలం 30 గంటల వ్యవధిలోనే 2.37 లక్షల మంది వీడియోను వీక్షించగా, లక్షల మంది వీడియోను షేర్ చేశారు. గత పదేళ్లలో ఇలాంటి తరహా కిడ్నాప్ ప్రయత్నం తాను చూడలేదని, అతడు ఉద్దేశపూర్వకంగానే స్టోర్ లో అందరూ చూస్తుండగానే చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడని ఫేస్ బుక్ యూజర్ క్రెయిగ్ కల్లాహన్ అభిప్రాయపడ్డాడు. తల్లి కళ్లెదుట, పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన విషయంపై వీడియో చూసిన తర్వాత తాను నిజంగానే భయపడ్డానని మరో యూజర్ మారీ బ్రూక్స్ కామెంట్ చేసింది.