కరిష్మా కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు | chennai police catch cine financier daughter in guntur | Sakshi
Sakshi News home page

సినీ ఫైనాన్సియర్ కూతురి కిడ్నాప్‌.. కీలక మలుపు

Published Thu, Mar 8 2018 10:24 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

chennai police catch cine financier daughter in guntur - Sakshi

సినీ ఫైనాన్షియర్‌ బోద్రా కూమార్తె కరిష్మా బోద్రా

సాక్షి, పెరంబూరు: టీనగర్‌కు చెందిన సినీ ఫైనాన్సియర్‌, వజ్రాల వ్యాపారి ముకుల్‌ చంద్‌ బోద్రా కందువడ్డీ కేసులో ఇద్దరు కొడుకులతో సహా అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా బోద్రాకు కరిష్మా బోద్రా(33) అనే కూతురు ఉంది. ఈమె గత నెల 28 నుంచి కనిపించకుండా పోయింది. 

దీంతో బోద్రా స్థానిక టీనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బోద్రా మంగళవారం(06-03-2018) రాత్రి తండ్రికి పోన్‌ చేసి తాను ఆంధ్రప్రదేశ్‌, గుంటూరులోని ఒక పాఠశాలలో ఉన్నట్లు చెప్పింది. ఆ సమాచారాన్ని బోద్రా స్థానిక తేనాంపేట పోలీసులకు చేరవేశారు. దీంతో ఒక ప్రత్యేక బృందం గుంటూరు వెళ్లి కరిష్మా బోద్రాను అదుపులోకి తీసుకుని విచారించింది. తండ్రి తనను కొట్టి, హింసించడంతోనే తాను పారిపోయాననీ కరిష్మా బోద్రా పోలీసులకు చెప్పారు.

మొదట స్థానిక నుంగంబాక్కంలోని తాను చదివిన పాఠశాలకు వెళ్లాననీ, ఆ తర్వాత గుంటూరులో ఉన్న ఓ పాఠశాలకు వచ్చానని పేర్కొన్నారు.
కుమార్తె కోసం బోద్రా కూడా గుంటూరు వెళ్లారు. అక్కడ కూతురిని తనకు అప్పగించవలసిందిగా పోలీసులను కోరారు. కేసు నమోదైనా కారణంగా ఆమెను న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. 

 ఈ సందర్భంగా బోద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తన కూతురు  ఆచూకీ తానే పోలీసులకు తెలపానన్నారు. అయినా పోలీసులు తన కూతురిని అప్పగించడానికి నిరాకరిస్తున్నారనీ వాపోయారు. అంతే కాకుండా పోలీసులు కూతురిని బెదిరించి తనకు వ్యతిరేకంగా వాంగూల్మం చెప్పించి మళ్లీ జైలుకు పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement