క్రూర మృగాన్నే అతి దారుణంగా చంపారు | Three Arrested in Shark Dragged to Death Incident | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 14 2017 1:12 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Three Arrested in Shark Dragged to Death Incident - Sakshi

న్యూయార్క్‌ : మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఓ షార్క్‌ను బోట్‌ కు కట్టేసి ఈడ్చుకెళ్లి మరీ చంపిన ఘటన కలవరపాటుకు గురిచేస్తోంది. 

ఫ్లోరిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గల్ఫ్‌ ఆఫ్‌ సమ్మర్‌లో ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటర్‌ బోట్‌కు తాడుతో దాని తలకు గాలం వేశారు. ఆపై ఆ అరడుగుల మూగజీవిని కట్టేసి ఈడ్చుకెళ్లారు. పైగా ఈ ఘటనను స్నాప్‌ఛాట్‌లో పోస్ట్‌ చేశారు కూడా. పైగా అది విలవిల కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆనందించారు. ఈ క్రమంలో పలువురు కామెంట్లు చేయగా.. వారితో సంవాదానికి కూడా దిగారు. 

చివరకు మోటర్‌ చక్రంలో పడి అది రెండు ముక్కలైంది. అనంతరం ఒడ్డుకు చేరాక అతికర్కశంగా ముక్కలైన దాని మృతదేహాన్ని చూపిస్తూ ఫోటోలు దిగారు. జంతు పరిరక్షణ సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. విచారణ అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేశారు. మైకేల్‌ వెంజెల్‌, అతని ముగ్గురు స్నేహితులు పార్టీ చేసుకునేందుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. మరోకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. 

పార్టీ కోసం వెళ్లి మూగజీవిపై దుశ్చర్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement