ఫ్లోరిడా : పారే నదిలో ఈత కొట్టడం అంటే ఎవరికి సరదా ఉండదు. కానీ ఈ సరదా కొన్నిసార్లు అపాయాలను కూడా తెచ్చి పెడుతుంది. ఫ్లోరిడాలోని మిలామీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా సముద్రంలోనే స్విమ్మింగ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా ఓ సొర చేప కూడా అదే సంద్రంలో ఈత కొడుతోంది. స్వేచ్ఛగా తనకు నచ్చినదారిలో ఈదుకుంటూ వెళ్తూ నెమ్మదిగా మనిషి సమీపంలోకి వెళ్లింది. దీంతో దానికి దారిస్తూ పక్కకు తప్పుకున్నాడు. అయినా సరే.. ఆ సొర చేప అతడిని వెంటాడుతూ సమీపంలోకి వెళ్లింది. దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా ఆ వ్యక్తి లోపల భయంగానే ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ మరింత దూరం జరుగుతున్నాడు. (చదవండి: 3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది!)
హారర్ సినిమాను తలపిస్తున్న ఈ దృశ్యాన్ని డ్రోన్ సాయంతో చిత్రీకరించగా ఈ వీడియోను స్థానిక ఫొటోగ్రాఫర్ జేసన్ మెకింటోష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సొర చేప మాత్రమే కనిపించినప్పుడు మామూలుగా ఉన్న మ్యూజిక్.. షార్క్‌కు దగ్గరలో మనిషి ప్రత్యక్షం కాగానే డేంజర్ బెల్స్ మోగించినట్లుగా ప్రతిధ్వనించే సంగీతం గుబులు పెట్టిస్తోంది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అతడి గుండెధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జస్ట్ మిస్.. లేదంటే సొర చేపకు స్నాక్ అయ్యేవాడంటూ మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడి చుట్టూ చక్కర్లు కొట్టిన సొర చేప సదరు మనిషిని గాయపర్చలేదని మెకింటోష్ స్పష్టం చేశాడు. (చదవండి: ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు, చివరికి..)
Comments
Please login to add a commentAdd a comment