సొరంగం.. మెక్సికో టు అమెరికా! | tunnel Mexico to the United States! | Sakshi
Sakshi News home page

సొరంగం.. మెక్సికో టు అమెరికా!

Published Thu, Apr 9 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

సొరంగం.. మెక్సికో టు అమెరికా!

సొరంగం.. మెక్సికో టు అమెరికా!

మెక్సికోలోని తిజువానా పట్టణంలో గల ఓ ఇంట్లో బట్టలు దాచే అల్మారా కింద నుంచి సొరంగం తవ్విన దృశ్యమిది. తిజువానా నుంచి సరిహద్దు కిందుగా అమెరికాలోని శాన్‌డీయాగో సమీపానికి చేరే దిశగా 500 అడుగుల దూరం తవ్విన ఈ సొరంగాన్ని మంగళవారం మెక్సికన్ సైనికులు కనుగొన్నారు.

మెక్సికో నుంచి అమెరికాకు డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకే స్మగ్లర్లు దీనిని తవ్వారని, ఈ సంఘటనకు సంబంధించి 9 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అధికారికంగా సరిహద్దును దాటే ప్రాంతానికి 7 మైళ్ల దూరంలో రహస్యంగా సరిహద్దును దాటేలా ఈ సొరంగం తవ్వినట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement