Hanuman Chalisa Row: మాజీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు బిగ్ షాక్ తగిలింది. వీరిద‍్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్‌డే కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు.
అయితే, హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత నవనీత్ రాణా దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. ఈ అభియోగంపై వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్‌పై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు.
ఇది చదవండి: డ్రాగన్ దేశం చైనాకు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment