న్యూఢిల్లీ: వైద్యురాలైన తన భార్య మృతికి కారణమైన ఎయిమ్స్ వైద్యుడు కమల్ వేది(34)కి స్థానిక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చర్మవ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్న కమల్ స్వలింగ సంపర్కుడు. ఎయిమ్స్‌లోనే అనస్తీషియా వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియ(31)ను ఐదేళ్ల కిందట వివాహమాడారు. ఇటీవల గొడవలు పెరిగాయి. భర్త అసహజ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్యహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొంటూ ప్రియ ఆదివారం హోటల్‌లో ఆత్మహత్య చేసుకుకుంది. పోలీసులు కమల్‌పై సెక్షన్ 498ఏ(క్రూరత్వం), 304బీ(వరకట్న చావు) కేసు నమోదు చేశారు.